తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Models Never Smile : ర్యాంప్‌పై నడిచేటప్పుడు.. మోడల్స్ ఎందుకు నవ్వరు?

Models Never Smile : ర్యాంప్‌పై నడిచేటప్పుడు.. మోడల్స్ ఎందుకు నవ్వరు?

Anand Sai HT Telugu

27 February 2023, 11:08 IST

    • Why Don't Models Smile : మీరు ఎప్పుడైనా టీవీలో లేదా రియాలిటీలో ఏదైనా ఫ్యాషన్ షో చూశారా? అలా చూస్తే.. మీరు ఒక్క విషయం గమనించాలి. మోడల్స్ ర్యాంప్‌పై ఎందుకు నవ్వరు? ఎప్పుడైనా పరిశీలించారా?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (pixabay)

ప్రతీకాత్మక చిత్రం

Models Never Smile : క్యాట్ వాక్ చేసే సమయంలో మోడల్స్(Models) అస్సలు నవ్వరుగాక నవ్వరు. మీరు చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఎందుకు నవ్వరు అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు మీరు వేసుకున్నారా? మోడల్స్ గంభీరంగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్(Trend) ఉంది. ర్యాంప్‌పై నవ్వకుండా ఉంటే.. ఆ వ్యక్తి భావోద్వేగాలు తనపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

పూర్వకాలంలో రాజకుటుంబాల స్త్రీలు తమ పెంపుడు జంతువులతో పెయింటింగ్(Painting) గీయించిన బొమ్మలు, లేదా ఫొటోలు చూస్తే.. నవ్వేవారు కాదు. ఆ కాలం నాటి పెయింటింగ్‌ను మీరు ఎప్పుడైనా చూసినట్లయితే, మీరు ఈ విషయం గమనించాలి. 19వ శతాబ్దంలో కోపంగా, గంభీరంగా ఉండటాన్ని ఉన్నత హోదా, సంపదకు చిహ్నంగా పరిగణించారు. నేటికీ ఈ నమ్మకాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఖరీదైన బట్టలు(Costly Dress) ధరించి ర్యాంప్‌పై నడిచే మోడల్స్ ఎప్పుడూ నవ్వరు. నవ్వకుండా, మోడల్స్ ప్రేక్షకుల ముందుకు వస్తారు.

నవ్వకపోవడం ఒక వ్యక్తి తన భావోద్వేగాలు తనపై ఆధిపత్యం చెలాయించకుండా చేస్తుందట. మోడల్‌లు ఎల్లప్పుడూ కొత్త ట్రెండ్‌(New Trends)లను కలిగి ఉండటం కూడా నవ్వకుండా ఉండటానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే బజారులో దొరకని బట్టలు వాళ్లు వేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఆమె కూడా తనపై విశ్వాసం చూపించేలా గంభీరంగా ముఖం పెట్టాలి. మోడల్ నవ్వకపోతే ఎవరూ నవ్వలేరు.

సీరియస్ లుక్(Serious Look) కూడా స్వీయ అంగీకార భావాన్ని ప్రతిబింబిస్తుంది. మోడల్స్ కూడా చాలా సార్లు వింత దుస్తులు ధరించాలి. అలాంటప్పుడు సీరియస్‌గా ముఖం పెట్టి, తనను తాను అంగీకరించానని, ఎవరి ఆమోదం అవసరం లేదని కూడా చూపిస్తుంది. చిరునవ్వుతో కూడిన ముఖంతో వాక్ చేస్తే.. ప్రేక్షకుల దృష్టి బట్టల నుండి ముఖంపైకి వస్తుంది. మోడల్స్ చేసే ప్రధాన పని ఏమిటంటే.. బట్టలను చూపించడం.. అలా నవ్వకుండా, జనాల దృష్టిని బట్టల వైపు ఆకర్షిస్తారు.

అంతేగాకుండా నవ్వు ముఖం(Smile Face) కాకుండా.. గాంభీర్యమే ఎక్కువ మందిని ఆకర్శిస్తుందనే ఓ సిద్ధాంతం ఫ్యాషన్ ప్రపంచంలో ఉంది. ఏదైనా ఉత్పత్తులను పరిచయం చేసేప్పుడు.. మోడల్స్ నవ్వకూడదని రూపకర్తలు కోరుతారట. ప్రోడక్ట్స్ పరిచయం చేసే సమయంలో మోడల్స్ భావవ్యక్తీకరణ చేస్తే.. వినియోగదారుడి దృష్టి.. ప్రోడక్ట్ మీద కాకుండా మోడల్ మీదకు వెళ్తుంది. ఇలా చాలా కారణాలతో క్యాట్ వాక్(Cat Walk) చేస్తూ.. మోడల్స్ నవ్వరు.

టాపిక్