Telugu News  /  Entertainment  /  Rashmika Mandanna Interesting Comments On Boycott Bollywood Trend
రష్మిక మందన్న
రష్మిక మందన్న (instagram)

Rashmika Mandanna: బాయ్‌కాట్ ట్రెండ్‌ పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

23 September 2022, 16:50 ISTNelki Naresh Kumar
23 September 2022, 16:50 IST

Rashmika Mandanna: బాయ్‌క‌ట్ ట్రెండ్ గురించి తాను వినలేదని చెప్పింది కూర్గ్ బ్యూటీ రష్మిక మందన్న. తన పరిధిలో లేని విషయాల గురించి మాట్లాడనంటూ బాలీవుడ్ సినిమా గుడ్ బై ప్రమోషన్స్ లో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna: గత కొన్నాళ్లుగా బాయ్‌క‌ట్ ట్రెండ్ కారణంగా బాలీవుడ్ సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ ఛడ్డా తో పాటు పలు హిందీ సినిమాల్ని బాయ్‌క‌ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్వీట్స్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ వసూళ్లపై ప్రభావాన్ని చూపించాయి. ప్రజెంట్ బాయ్‌క‌ట్ ట్రెండ్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సినిమాతోనే రష్మిక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో రష్మిక బిజీగా ఉంది. ఈ బాయ్‌క‌ట్ ట్రెండ్ పై రష్మిక స్పందించింది. ఈ కాన్సెప్ట్ గురించి తానెప్పుడూ వినలేదని చెప్పింది రష్మిక మందన్న.

కొత్త అంశాల గురించి మాట్లాడటానికి వాటి గురించి ఎంతో కొంత తెలిసి ఉంటే బాగుంటుందని పేర్కొన్నది. అవగాహన లేని విషయాలపై స్పందించనంటూ బదులిచ్చింది. ‘నా పరిధిలో లేని అనవసరపు విషయాల గురించి మాట్లాడటం వల్ల టెన్షన్ పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. వర్క్ ను ఎంజాయ్ చేయడానికే నేను ప్రాధాన్యతనిస్తా. పని తప్ప ఇతర విషయాలపై అంతగా పట్టించుకోను’ అని రష్మిక చెప్పింది. సినిమా తాలూకు అందమైన జ్ఞాపకాల్ని అందరితో షేర్ చేసుకోవడంలోనే ఆనందం ఉంటుందని అన్నది.

స్టూడియో బయట ఏం జరుగుతుందో ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయాలని అనుకోనని పేర్కొన్నది. తన సినిమాల్ని ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే చూడాలని కోరుకుంటానని తెలిపింది. సినిమా సక్సెస్ అనేది నటీనటుల చేతుల్లో ఉండదని, ఆయా సినిమా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల అభిరుచులు విజయాల్ని డిసైడ్ చేస్తాయని చెప్పింది.

మారుతున్న అభిరుచులను తెలుసుకుంటూ సినిమా చేయడం ముఖ్యమని చెప్పింది. నటిగా తనకు ఎలాంటి భాషాభేదాలు లేవని, బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడైనా మంచి సినిమా చేయడానికి ఇష్టపడతానని పేర్కొన్నది.గుడ్ బై సినిమాలో రష్మిక మందన్న తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. వికాస్ భల్ దర్శకత్వం వహించారు. త్వరలోనే రష్మిక మందన్న పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టబోతున్నది.