తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Korean Glass Skin : ఇంట్లో ఉండే వాటితోనే కొరియన్ గ్లాస్ స్కిన్ పొందండి

Korean Glass Skin : ఇంట్లో ఉండే వాటితోనే కొరియన్ గ్లాస్ స్కిన్ పొందండి

HT Telugu Desk HT Telugu

12 February 2023, 15:02 IST

    • Korean Glass Skin Tips : అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక చాలా ఫేమస్ అయిన కొరియన్ గ్లాస్ స్కీన్ కోసం.. చాలా సెర్చ్ చేస్తారు. అయితే ఇంట్లోని వాటితో అందమైన కొరియన్ గ్లాస్ స్కిన్ పొందొచ్చు.
కొరియన్ గ్లాస్ స్కిన్
కొరియన్ గ్లాస్ స్కిన్

కొరియన్ గ్లాస్ స్కిన్

కొరియన్ గ్లాస్ స్కిన్(Korean Glass Skin) చూస్తే.. అబ్బా ఎంత బాగా ఉందో అనిపిస్తుంది. మరి అలాంటి స్కిన్ రావాలని చాలా మంది కోరుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఫీడ్‌లు చూస్తుంటే.. కొరియన్ బ్యూటీ ట్రెండ్స్ ఊపు ఊపేస్తున్నాయి. కొరియన్లు అందమైన చర్మానికి ప్రసిద్ధి చెందారు. వారిని చూస్తే.. భలే అనిపిస్తుంది. చాలా మంది ఇండియన్స్ కూడా అలాంటి చర్మం కావాలని కోరుకుంటారు. గ్లాస్ స్కిన్(Glass Skin) అంటే చాలా స్మూథ్‌, హైడ్రేట్‌గా, అందంగా ఉంటుంది.. దీనినే గ్లాస్ స్కిన్ అని చెబుతారు. దీనికోసం గూగుల్ తల్లిని తెగ అడుగుతుంటారు. అయితే హోం రెమెడీస్ తో కొరియన్ గ్లాస్ స్కిన్ పొందొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

Foundation Side effects: ప్రతిరోజూ ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే జరిగేది ఇదే

కలబంద

ఇది మొటిమలు, ఇతర చర్మ పరిస్థితులను మాయిశ్చరైజింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్, చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. మనం దీన్ని ముఖాని రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు. జెల్‌ను తీయడానికి కలబంద(Aloe vera) ఆకును సగానికి కట్ చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి గంటసేపు అలాగే వదిలేయండి. మీ ముఖాన్ని కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

తేనె

చర్మ సంరక్షణకు తేనె(Honey) ఉత్తమమైనది. మీ చర్మానికి రెగ్యులర్‌గా తేనెను అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మెరుస్తున్న ఆరోగ్యకరమైన, యవ్వనంగా కనిపించే చర్మం మీకు వచ్చేందుకు సహాయపడుతుంది. రాత్రిపూట ముఖంపై తేనెను పూయడం వలన ఎక్కువ సమయం ఇచ్చినట్టవుతుంది. తేనెను చర్మానికి 10 లేదా 15 నిమిషాలు అప్లై చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రైస్ వాటర్

రైస్ వాటర్‌(Rice Water)ను స్కిన్ టోనర్‌గా రోజుకు రెండుసార్లు లేదా రోజుకు ఒకసారి ఫేషియల్ మాస్క్‌గా ఉపయోగించడం సురక్షితం. బియ్యం(Rice) నీరు ఎండ, యాంటీ ఏజింగ్(Anti Ageing) నుండి కూడా రక్షిస్తుంది. బియ్యాన్ని ముందుగా కడగండి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి.. కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. బియ్యం నీటిని తీయండి. అవి వాడుకోవచ్చు. లేదంటే.. బియ్యం ఉడకబెట్టి, దాని గంజిని వడకట్టి కూడా ఉపయోగించొచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ(Green Tea)లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాలను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతం చేస్తుంది. ఇందులో విటమిన్ బి2 కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది.

టాపిక్