Kitchen Hacks : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బియ్యంలో, పిండిలో పురుగులు వస్తున్నాయా?-how to prevent bug from rice and atta here is the tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kitchen Hacks : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బియ్యంలో, పిండిలో పురుగులు వస్తున్నాయా?

Kitchen Hacks : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బియ్యంలో, పిండిలో పురుగులు వస్తున్నాయా?

Published Jan 25, 2023 09:28 AM IST Geddam Vijaya Madhuri
Published Jan 25, 2023 09:28 AM IST

  • Prevent Bugs from Ataa and Rice : బియ్యం, పిండి వంటి వాటిలో పురుగులు, కీటకాలు ఊరికే వస్తూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మీరు డబ్బా ఓపెన్ చేసే సరికి దానిలో పురుగులు దర్శనమిస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. సులభంగా వీటిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు.

ఎంత జాగ్రత్తగా దాచినా.. బియ్యం, పిండిలలో పురుగులు, కీటకాలు ఉంటాయి. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ కీటకాలను సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)

ఇంట్లో ధనలక్ష్మి ఉండాలంటే.. అన్నంలో కొద్దిగా తులసి ఆకు పెట్టుకోవాలని చెబుతారు. ఈ నమ్మకం గ్రంధాల ప్రకారం ఉంది. మరోవైపు బియ్యం నుంచి పురుగులను తొలగించడానికి కొన్ని బే ఆకులను ఉంచాలని చెబుతారు. బియ్యాన్ని గాలి చొరబడని కవర్‌తో కప్పి, 3-4 రోజులు ఫ్రిజ్‌లో ఉంచండి. దీనివల్ల కూడా కీటకాలు చనిపోతాయి.

(2 / 6)

పిండిలో చాలా త్వరగా కీటకాలు, పురుగులు పట్టుకుంటాయి. ఈ సమస్య నుంచి పిండిని రక్షించడానికి.. దానిలో లవంగాలు, ఏలకులతో నిండిన మస్లిన్ క్లాత్ ఉంచవచ్చు. దీనివల్ల కీటకాలు దూరంగా ఉంటాయి.

(3 / 6)

(Freepik)

కీటకాల బారిన పడే అవకాశం పిండి పదార్థాలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిండిని కీటకాల నుంచి దూరంగా ఉంచడానికి.. పిండి వేసే డబ్బాలో ఒక వేప ఆకు లేదా రెండు వేయండి. అలాగే చీమలు లేదా కీటకాల నుంచి దూరంగా ఉండటానికి మీరు బే ఆకు లేదా పెద్ద ఏలకులను పిండిలో వేయవచ్చు.

(4 / 6)

రవ్వల్లో పురుగులు, కీటకాలు సర్వసాధారణం. వాటి నుంచి రవ్వను దూరంగా ఉంచడం చాలా కష్టం. ఈ సమస్యను దూరంగా ఉంచుకోవాలంటే.. దానిలో కొన్ని లవంగాలు ఉంచండి. లేదంటే మిరియాలు కూడా ఉంచవచ్చు. 

(5 / 6)

కీటకాలు నుంచి వంటగదిని దూరంగా ఉంచడానికి చిట్కాలు పాటించండి. వంటగది తరచుగా కీటకాలు, సాలెపురుగులతో నిండి ఉంటుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి వంటగదిలోని వివిధ ప్రదేశాలలో వెల్లుల్లి, కొన్ని లవంగాలను ఉంచండి. ఇలా చేయడం వల్ల కీటకాలు అక్కడికి చేరవు. (ఈ నివేదికలోని సమాచారం సంప్రదాయ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు