తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : గతము చేసిన గాయమన్నది నుదిటి రాత మార్చేనా?

Wednesday Motivation : గతము చేసిన గాయమన్నది నుదిటి రాత మార్చేనా?

14 September 2022, 6:48 IST

    • Wednesday Motivation : గతం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి మంచినిస్తే.. మరికొందరికి చెడుని ఇస్తుంది. మంచినిస్తే ఎదుటివారికి ఆదర్శంగా చెప్తాము. కానీ చెడునిస్తే.. ఆ తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాము. కానీ ఆ గతం మిమ్మల్ని నిలువునా దహించివేస్తుంటే మాత్రం మీరు మీ గతంతో బ్రేక్ తీసుకోవాలి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : గతం గతః. ఇది అందరూ మరోసారి గుర్తు చేసుకోవాల్సిన మాట. ఎందుకంటే మీ భవిష్యత్తు, కాదు కాదు మీ ప్రస్తుతం బాగుండాలి అన్నా.. మీ గతాన్ని వదిలి ముందుకు వెళ్లాలి. అలా వెళ్తేనే మీ భవిష్యత్తు మారుతుంది. గతం నేర్పిన పాఠాలను మరిచిపోకూడదు. కానీ గతం చేసినా గాయాలనుంచి బయటకు వస్తేనే.. మీకు, మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్నవారికి మంచిది.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

గతంలోనే ఉండాలి అనుకున్నప్పుడు.. గతంలో మీకు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. ఏ విషయమైన ఎక్కువ విషాదాన్ని నింపింది అంటే కచ్చితంగా దానిలో ఎంతో కొంత మీకు మంచి గుర్తులు, జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అవి మీకు తెలియని ప్రశాంతతను ఇస్తాయి. ఎందుకంటే జీవితంలో ఎప్పటికి జరగవు అనుకున్నవి అప్పుడు మీకు జరిగి ఉండొచ్చు. అవి ఇప్పుడు లేవు కాబట్టే మీ బాధ మిమ్మల్ని దహించి వేస్తూ ఉండొచ్చు. కాబట్టి గతం చేసినా గాయాన్ని మీరే తగ్గించుకోవాలి. ఆ మంచి జ్ఞాపకాలే గాయానికి మందుగా మార్చుకోవాలి.

మీ వర్తమానం, భవిష్యత్తు కోసం ముందుకు సాగడంలో తప్పులేదు. భవిష్యత్తును నాశనం చేసే గతాన్ని వదిలివేయడమే మంచిది. మీ గతం మీ ప్రస్తుత జీవితాన్ని నియంత్రించేలా చేయొద్దు. మీరు గతం గురించి విచారిస్తూ కూర్చొంటే.. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందలేరు. దీనికి మీకు ఎవరూ సహాయంం కూడా చేయలేరు.

మీ గతం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మంచిదే కానీ.. ఆపేస్తుంటే మాత్రం మీరు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. గతం నేర్పిన అనుభవాలను మీ విజయానికి సాధనంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే.. మీ గతాన్ని మరచిపోయి కొత్తగా ప్రారంభించడం అయినా చేయాలి. అంతేకానీ అక్కడే శిలలా ఆగిపోకూడదు.

టాపిక్