తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : అపర్థాలు వచ్చినవెంటనే క్లియర్ చేసుకోవాలి.. లేదంటే కష్టమే..

Sunday Motivation : అపర్థాలు వచ్చినవెంటనే క్లియర్ చేసుకోవాలి.. లేదంటే కష్టమే..

11 September 2022, 7:00 IST

    • ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే మనస్పర్థలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీనిని ఆలస్యం చేసే కొద్ది వారి మధ్య దూరం పెరిగిపోతుంది. కాబట్టి మీ మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా అపర్థాలు చోటు చేసుకోవడం సహజం. కానీ అవి కొన్నిసార్లు మనస్పర్థలకు దారి తీస్తాయి. ఆ సమయంలో ఒకరిమాటను మరొకరు అర్థం చేసుకోలేని స్టేజ్​లో ఉంటారు. కానీ ఆ సమయంలో టైమ్ తీసుకోకుండా.. ప్రాబ్లమ్ పెద్దది కాకుండా చూస్తేనే మంచిది. ఎందుకంటే సమయం పెరిగే కొద్ది వారి మధ్య దూరం పెరిగిపోతుంది. ఎందుకంటే.. ఓ తుఫానుకూడా ఓ చినుకుతోనే మొదలవుతుంది. ఆ చినుకులు చిన్నగున్నప్పుడు ఏమి తెలియదు. కానీ తుఫాను వెళ్లిపోయాకే తెలుస్తుంది జరిగిన నష్టమేమిటో.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

బంధంలో అయినా గొడవలు సహజమే. కానీ వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే.. తర్వాత క్లియర్ చేయడానికి ఏముండదు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కాబట్టి. అందుకే ఒకరితో మాట్లాడేటప్పుడు, మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా వాటిని వెనక్కి తీసుకోలేము కాబట్టి.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాకాకుండా గొడవ జరిగిన కొన్ని రోజుల తర్వాత వస్తే పెద్ద లాభం ఉండదు.

మనిషికి తగిన స్పేస్ ఇవ్వాలి కరెక్టే. కానీ ఆ స్పేస్​లో మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ ఉండాలి కానీ.. మీ వల్ల కలిగిన మనస్పర్థలు కాదు. మీ మధ్య మనస్పర్థలు వచ్చాక.. మీరు వాటి గురించి వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు మీ మధ్య అగాథం ఉండదు. కానీ వారికి ముందు సమయం ఇచ్చి.. తర్వాత నచ్చజెప్పడం మంచి పద్ధతి కాదు. ముందు నచ్చజెప్పి తర్వాత.. వారికి తగినంత సమయం ఇవ్వాలి. అప్పుడు సమస్యలు క్లియర్ అవుతాయి. లేదా మీకు ఓ క్లారిటీ వస్తుంది. ఓ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మీరు తప్పుచేసినా.. మీ ప్రయత్నం మీరు చేశారు కాబట్టి.. వారి నిర్ణయానికి మీరు ఆటోమేటిక్​గా గౌరవం ఇచ్చేస్తారు.

కొన్ని మందులు ఎండ్ డేట్ అయిపోయాక ఎలా ఉపయోగపడవో.. కొన్ని సమస్యలకు కూడా అలా ఎండ్ డేట్​లు ఉంటాయి. దెబ్బ తగిలినప్పుడే మందు వేయాలి. మనిషి పోయాక వచ్చి మందు వేసినా లాభం లేదు. వాడు వేరే మందు ఉపయోగించినా.. ఇప్పుడు మీరు వేసే మందుకు పెద్ద వాల్యూ ఉండదు. కాబట్టి మీ ఆత్మీయులను దూరం చేసుకోకూడదు అనుకున్నప్పుడు మీరు కచ్చితంగా సమస్య మొదలైనప్పుడే వారితో దాని గురించి మాట్లాడండి. వారు విని స్థితిలో లేకుంటే అర్థమయ్యేలా ఓ చక్కని మెసేజ్ చేయండి. అంతేకానీ ఆ గొడవను మరింత పెంచే మాటలు మాట్లాడకండి. ఎందుకంటే అవి మీ బంధాన్ని కచ్చితంగా మీకు దూరం చేస్తాయి. తర్వాత ఎంత మొత్తుకున్నా రావు.