తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On Sometimes Its Better To Just Remain Silent And Smile.

Sunday Motivation : కొన్నిసార్లు సైలంట్​గా ఉండడమే బెటర్.. ఎందుకంటే..

28 August 2022, 6:00 IST

    • ఒక్కోసారి మీ దగ్గర ప్రతి మాటకి సమాధానం ఉండొచ్చు. కానీ మీరు సైలంట్​గా ఉన్నారంటే అర్థం సమాధానం లేక కాదు. మిమ్మల్ని ఏదో ఫీలింగ్ సమాధానం ఇవ్వకుండా ఆపేస్తుంది. అప్పుడు మీ మైండ్, మనసులో ఎన్ని మాట్లాడుకున్నా.. పెదాలు కదలవు. సరికదా ఓ చిన్న స్మైల్ వస్తుంది. అది సంతోషంతో వచ్చేది కాదు. ఆ స్మైల్ ఓ రకమైన నిట్టూర్పు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే.. మౌనం కూడా ఓ శక్తివంతమైన వ్యక్తీకరణే కాబట్టి. ఆ మౌనంలో ఎన్నో మాటలు దాక్కుని ఉంటాయి. ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. మనసు మథనపడుతూ ఉంటుంది. ప్రతి మాటకు బదులు ఇస్తాము కానీ.. అవి పెదవి దాటి బయటకు రావు. నోటి చివరి వరకు పదాలు దొర్లుతూ వచ్చినా.. పంటి బిగువన వాటిని పట్టి ఆపేస్తాము. మాటలు, చేతలు భరిస్తూ కూడా సైలంట్​గా ఉండడం అంత సులువేమి కాదు. కానీ మీరు ఉన్నారంటే కచ్చితంగా మీరు ఓ మెట్టు ఎక్కేసినట్టే.

ట్రెండింగ్ వార్తలు

World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు

Korrala laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే HIV సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు

మీరు బంధాన్ని కాపాడుకోవడానికి సైలంట్​గా ఉండొచ్చు. బంధం తెగిపోయింది అనుకున్నప్పుడు సైలంట్​గా ఉండొచ్చు. కానీ మీ సెల్ఫ్​రెస్పెక్ట్ పోతున్నప్పుడు కూడా సైలంట్​గా ఉన్నారంటే.. మీరు రోజు రోజుకి మరింత వైలంట్ అయినా కావొచ్చు.. స్ట్రాంగ్​ అయినా కావొచ్చు. కొన్నిసార్లు వ్యర్థమైన చర్చలు అనవసరం అనిపించి కూడా మీరు మౌనంగా ఉండిపోతారు. లేదా మీరు మాట్లాడేది తప్పు అని వారికి చెప్పాల్సిన అవసరం మీకు లేదని అనిపించవచ్చు. ఎందుకంటే మీరేంటో మీకు తెలిస్తే చాలు. పక్కనివాళ్లకి తెలియాల్సిన అవసరం లేదనే మెచ్యూరిటీ అయినా అయి ఉండొచ్చు. ఈ విషయంలో మీకు కచ్చితంగా క్లారిటీ ఉండాలి. లేదంటే మీరే ఆలోచనలతో ఒత్తిడిని పెంచేసుకుంటారు.

కోపంలో జారే మాటాలు వెనక్కి తీసుకోవడం కష్టం. ఆ తప్పు మీరు చేయకూడదు అనుకుంటున్నారేమో. అందుకే వారు అనే మాటలతోనే కడుపు నింపేసుకుని.. కుమిలిపోతూ.. ఆ తప్పు మీరు చేయకుండా సైలంట్​గా ఉంటున్నారేమో. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి సెకన్​ చాలు. కానీ ఆ సమయంలో అనరాని మాట ఒక్కటి అన్నా లైఫ్​లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే మీకు చాలా రిగ్రేట్స్ ఉంటాయి. మళ్లీ కొత్తవి ఎందుకు అని మౌనంగానే ఉంటున్నారేమో.

కొన్ని మాటలు పడుతూ.. ఛీత్కారాలను తీసుకుంటున్న మీరు.. వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి.. నవ్వుకుంటున్నారంటే.. మీరు చాలా డేంజర్ స్టేజ్​కి చేరుకున్నారని అర్థం. ఎందుకంటే ఆ నవ్వులో ఓ రకమైన నిట్టూర్పు ఉంటుంది. అది మిమ్మల్ని లాంగ్​ బ్రీత్​ తీసుకునేలా చేస్తుంది. పైగా నవ్వుకోవడం తప్పుకాదు. బ్యాక్​గ్రౌండ్​లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే సాంగ్ వేసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్​లో అంతకు మించి ఏమి చేయలేము కాబట్టి.