Sunday Motivation : మీ ప్రశాంతతను మీరే వెతుక్కోవాలి.. అది ఎవరో ఇచ్చేది కాదు..
07 August 2022, 1:52 IST
- Sunday Quote : ఓ మనిషికి శాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? మన పరిస్థితులను.. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే శాంతి దొరుకుతుంది. అంతేకానీ అది ఎవరో ఇస్తేనో.. ఎవరో చెప్తేనో వచ్చేది కాదు. కాబట్టి మీ ప్రశాంతతను మీరే వెతుక్కోండి. ఎవరో ఇచ్చింది తీసుకుంటే అది ఎంతోకాలం ఉండదు.
కోట్ ఆఫ్ ద డే
Sunday Motivation : ప్రశాంతత అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఇది లేకపోతే ఎంత డబ్బు ఉన్నా.. ఎందరు మన చుట్టూ ఉన్నా సుద్ధ వేస్టే. మీరు దానిని బలవంతంగా పొందలేరు. లేదా అజమాయిషీ చేసి లాక్కోలేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీకోసం దానిని ఎవరూ తెచ్చినా.. దాని స్వరూపం మారిపోతుంది. మరి ఈ ప్రశాంతత మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే.. మనలోనే. అవును మన ఆలోచనలు, మన చేతలే మనకు శాంతిని ఇస్తాయి.
మనం ప్రశాంతంగా ఉండాలంటే.. ముందు మన చుట్టూ ఉన్నా.. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. చుట్టూ ఉన్నవారు ఎలాంటివారో.. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే విషయాలపై క్లారిటీ ఉంటే.. మీరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ముందు కొన్ని విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి.
ముందు మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీకు రావాల్సిన క్లారిటీ గురించి ఇతరులతో చర్చించండి. వారు చెప్పే విషయాలపై అవగాహన తెచ్చుకోకండి. పరిస్థితులు తీవ్రంగా మారుతున్నప్పుడు మీరు సైలంట్‌గా ఉండడమే మంచిది. అప్పుడే మీకు కొన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. అప్పుడే అది మీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చేస్తుంది. అంతేకానీ మీరు కోపంతో బిగ్గరగా అరుస్తున్నప్పుడు.. మీకు సానుకూలంగా ఏమీ జరగదు. అందుకే ప్రశాంతంగా ఉండడమే మీకు మంచిది. అవతలి వ్యక్తి ఎలా అరుస్తున్నప్పటికీ.. మీరు ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. వారి ఆలోచనలన్నింటినీ వినాలి.
వాటిని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేకపోయినా.. వారి అభిప్రాయాన్ని వినండి. మీరు ఇతరుల నుంచి కొన్ని విషయాలు విన్నప్పుడు.. ఆ పరిస్థితిని సులభంగా పరిష్కరించడం మీకు అలవాటు అవుతుంది. మీరు ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అవతలి వ్యక్తి కూడా మంచిగా ఫీల్ అవుతాడు. ఇది మిమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
మీ ఆలోచనను కూడా వారి ముందుగా ఉంచండి. వారు వినకపోతే లైట్ తీసుకోండి. ఆపై దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొన్ని సమయాల్లో ఓపికగా ఉండడం చాలా అవసరం. మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించండి. మీకు చాలా విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడే అర్థమవుతాయి. కాబట్టి మీకు మీరు ఎక్కువ సమయం ఇచ్చుకోండి. ప్రశాంతంగా ఆలోచించుకోండి. అదే మీకు మంచిది.
టాపిక్