తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : ఈరోజైనా మీ సమస్యలకు బ్రేక్ ఇవ్వండి.. లెట్స్ ఎంజాయ్ ద డే..

Sunday Motivation : ఈరోజైనా మీ సమస్యలకు బ్రేక్ ఇవ్వండి.. లెట్స్ ఎంజాయ్ ద డే..

04 September 2022, 6:00 IST

    • Sunday Motivation : ఈరోజు సండే నాకు పనికి బ్రేక్ కావాలి. ఈరోజు సండే నేను నా డైట్​కు బ్రేక్ ఇస్తా. ఈరోజు సండే నేను ఉదయం లేటుగా లేస్తాను. ఈరోజు సండే నేను నాకు నచ్చిన సినిమా చూస్తాను. ఇలా సండేకి ఏవేవో అనుకుంటాము కదా. అలాగే ఈసండేకి అయినా మీ స్ట్రెస్​కి బ్రేక్ ఇవ్వండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : కొన్ని విషయాలు మనం మార్చాలని ఎంత అనుకున్నా అవి జరగవు. ఎందుకంటే అవి మన కంట్రోల్​లో ఉండవు కాబట్టి. మన కంట్రోల్​లో లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించేసి.. బుర్ర కరాబ్ చేసుకోవడం కన్నా.. ఒత్తిడిని తగ్గించుకుంటే బెటర్. ఎందుకటే మీ స్ట్రెస్ మీకు మెంటల్​గా, ఫిజికల్​గా అనారోగ్యాలను తెస్తుంది. అంతకుమించి మీకు ఏ ప్రయోజనాలు ఉండవు.

ఎక్కువ ఆలోచిస్తే లేదా ఎక్కువ ఒత్తిడికి గురైతే.. పరిస్థితులు మీ కంట్రోల్​లోకి వచ్చేస్తాయి అంటే ఎంతసేపైనా ఆలోచించుకోండి. కానీ ఏ మాత్రం కంట్రోల్​లో లేని పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచించేసి.. మనం స్ట్రెస్​ తీసుకోవడం తప్పా.. ఆవగింజ అంత ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి మీ సమస్యలకు ఓ రోజైనా బ్రేక్ ఇవ్వండి. అది మీకు, మీ మెంటల్ హెల్త్​కి మంచిది.

ఉదయం లేవగానే ఈరోజు వాటి గురించి (మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యల గురించి) ఆలోచించను అనుకోండి. ఎంత వీలైతే అంత బిజీగా ఉండండి. ఫ్రెండ్స్​తో టైమ్ స్పెండ్ చేయండి. గేమ్స్ ఆడుకోండి. సినిమా చూడండి. లేదంటే పాక్, ఇండియా మ్యాచ్ చూడండి. ఇలా ఏది చేసినా సరే.. మీ సమస్యల గురించి ఆలోచించడం మాత్రం మానేయండి.

మీకు ఏది నచ్చితే ఆ పని చేయండి. మీ బ్రెయిన్​కి ఒక్కరోజైనా రెస్ట్ ఇవ్వండి. మీ ఆలోచనలకు కూడా బ్రేక్ కావాలి. అప్పుడే మెరుగైన ఆలోచనలు వస్తాయి. అంతేకానీ పండుగరోజు కూడా పాత మొగుడేనా అన్నట్లు అయిపోతుంది మీ పరిస్థితి. దాని అర్థం మొగుడి మార్చమని కాదు.. కొత్తగా అనిపించేలా ఏదైనా చేయమని. ఇది కూడా అంతే ప్రాబ్లమ్స్​ని వదిలేయమని కాదు. వాటినుంచి బ్రేక్ తీసుకోమని. కొన్ని భరించలేకపోతే బంధాలనే వదులుకోమనే చట్టాలు ఉన్నాయి. ఈ సమస్యలెంత చెప్పండి.

ముందు బ్రేక్ తీసుకోండి. తర్వాత కూడా ఏమి తేడా లేకపోయినా కనీసం ఒక్కరోజు దాని గురించి ఆలోచించరు కాబట్టి పర్లేదు. కానీ బ్రేక్ మీకు నచ్చింది అనుకో మీరు దానిని కంట్రోల్ చేయనవసరంలేదు. కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే సమస్యలను కంట్రోల్​లో పెట్టలేము కదా.. కనీసం మన హ్యాపీనెస్​ని అయినా కంట్రోల్​లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్కరోజైనా మీ సమస్యలకు బ్రేక్ ఇవ్వండి. క్వాలిటీ టైమ్​ని స్పెండ్ చేయండి. సెల్ఫ్ గ్రోత్ గురించి ఇప్పుడైనా ఆలోచించడం మొదలుపెట్టండి. జీవితంలో కొన్నిరోజులైనా మనకోసం జీవించకపోతే ఇంక మనం బతికి లాభమేంటి?