Thursday Motivation : భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే.. ఈ రోజు కష్టపడాల్సిందే..-thursday motivational quote on every day do something that will inch you closer to a better tomorrow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే.. ఈ రోజు కష్టపడాల్సిందే..

Thursday Motivation : భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే.. ఈ రోజు కష్టపడాల్సిందే..

దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అది ఉండడం మంచిదే కానీ.. దాని మీద మాత్రమే దృష్టి ఉంటే సరిపోదు. మీ రోజువారీ కార్యకలాపాలపై కాస్త శ్రద్ధ వహించాలి. ఎందుకంటే జీవితంలో ప్రతి క్షణం ముఖ్యమే. ఈ కార్యకలాపాలు మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు మిమ్మల్ని దగ్గర చేస్తాయి.

కోట్ ఆఫ్ ద డే

Thursday Thought : ప్రతి రోజు మీకు కీలకమైనదని గుర్తుంచుకోండి. మీరు దానిలో ఒక్క క్షణాన్ని కూడా వదులుకోకూడదు. మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గరగా చేసేది ఏదైనా మీకు ముఖ్యమే. మీ మార్గంలో ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో మీకు తెలియదు. అందువల్ల మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. క్రమ పద్ధతిలో మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.

మీ పనితీరు క్రమ పద్ధతిలో ఉంటే.. మీరు ఎదుగుతూనే ఉంటారు. రేపటి మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్షిస్తున్నట్లయితే.. ఈరోజు నుంచే దానికోసం కృషి చేయాలి. మీకు మీరే వాగ్దానం చేసుకోవాలి. ప్రేమ, శాంతి, సమగ్రత మార్గంలో నడవాలి. మీరు మార్గంలో చాలా అడ్డంకులను ఎదుర్కోవచ్చు. వీటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి.

ఈ అడ్డంకులు మీ మంచి కోసమే జరిగాయని గుర్తుంచుకోండి. ఇవి మిమ్మల్ని బలపరుస్తాయి. లోపలి నుంచి మిమ్మల్ని మెరుగుపరుస్తాయి. జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. ఏదీ ఉచితంగా రాదు. మీరు జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలనుకుంటే.. మీరు ఈ అడ్డంకులన్నింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వాటి నుంచి మీరు ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు.

ఈ రోజు మీరు విజయవంతం కాకపోయినా.. రేపు అదే తప్పు పునరావృతం కాకుండా నిరోధించే పాఠాలను మీరు నేర్చుకోగలరు. అందువల్ల మీరు రేపటి భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఈరోజు కష్టపడి, ఉత్తమంగా పని చేయాలి. ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించండి. మీ వంతు కృషి చేయండి.

సంబంధిత కథనం