Saturday Motivation : నీ గతం చీకట్లో ఉన్నా.. ఫ్యూచర్‌ని వెలుగులోకి తెచ్చుకోవాల్సింది నువ్వే..
Saturday Motivation : ప్రతి ఒక్కరికీ ఏదొక గతం ఉంటుంది. కానీ దాని గురించే ఆలోచిస్తూ.. ప్రజెంట్‌ని బాధపెట్టడం కరెక్ట్ కాదు. గతాన్ని మరిచిపోమని చెప్పలేము. ఎందుకంటే గతంపైనే మన ప్రజెంట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ కాస్త జాగ్రత్త పడితే.. అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుంది.
Saturday Motivation : చాలా మందికి చీకటి గతాలు ఉంటాయి. కానీ కొందరు దాని గురించే ఆలోచిస్తూ.. ఆ చీకట్లోనే మగ్గిపోతూ.. ఎవరూ తోడు రావడం లేదని బాధపడుతూ.. ప్రస్తుత క్షణాన్ని, ప్రస్తుత ఆనందాల్ని దూరం చేసుకుంటారు. మరికొందరు గతాన్ని స్వాగతిస్తూ.. ప్రజెంట్ను తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. రెండు పరిస్థితుల్లోనూ గతం కామన్ అయినా.. దానిని తీసుకునేవారు మాత్రం డిఫరెంట్. ఒకరు శోకానికి దారి వేస్తే.. మరొకరు శోకాన్ని దాచుకుని ప్రస్తుతంలో జీవించేవారు.
గతాన్ని అంత ఈజీగా మరచిపోలేము. అంత సులువుగా మరచిపోవడానికి మనం ఏమైనా గజినిలమా? కాదు కదా. కానీ ఎంత ఆలోచించినా.. గతాన్ని అయితే మార్చగలమా? కొంచెం కూడా మార్చలేము. అలా మార్చలేని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చొని ఏం లాభం. గతం గతః అని ఊరికే అనలేదు. చీకటి వెళ్తేనే లైఫ్‌లోకి వెలుగు వస్తుంది. లేదు నేను చీకట్లోనే ఉంటాను అంటే మీ జీవితంలోకి వెలుగు ఎలా వస్తుంది?
తర్వాత నా దగ్గరకు వెలుతురు రావట్లేదని బాధపడినా ప్రయోజనం ఉండదు. నీ దీపాన్ని ఆర్పేది నువ్వే.. వెలుతురు రాకుండా గది మూసుకునేది నువ్వే అయితే వెలుగు ఎలా నీ జీవితంలోకి వస్తుంది? నీ దీపం వెలిగించుకోవాల్సింది.. నీ చీకటి గది తలుపులు తెరవాల్సింది నువ్వే. నువ్వే ఆగిపోతే.. నీ కోసం కాలం ఎందుకు తిరిగి వస్తుంది.
మార్చలేని గతం గురించి ఆలోచించి.. అందమైన వర్తమానాన్ని తీర్చిదిద్దుకుంటే.. గతం కూడా మీరు ముందుకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది. మీ వర్తమానాన్ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే.. మీ భవిష్యత్తు మీకు నచ్చినట్టు మారే అవకాశముంది. మీరు వర్తమానంలో గతాన్ని, దానికి చెందిన ఆలోచనలను నియంత్రిస్తేనే ఇది సాధ్యమవుతుంది. పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చొంటే మీతో ఉన్నవారిని బాధపెట్టిన మూర్ఖులు మీరే అవుతారు.
సంబంధిత కథనం