తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote : మీ ఆనందాన్ని దూరం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వకండి.. అది మీది మాత్రమే

Wednesday Quote : మీ ఆనందాన్ని దూరం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వకండి.. అది మీది మాత్రమే

05 October 2022, 7:10 IST

    • Wednesday Quote : జీవితంలో మనం చాలా మందిని కలుస్తాము. కలవకుండా ఉండే అదృష్టం ఎలాగు లేదు. కానీ.. కలిసిన వాళ్లు మనల్ని సంతోషంగా ఉంచితే ఓకే. కొందరు మన సంతోషాలను దూరం చేయడానికే వస్తారు. మనతో ఉంటూనే మన ఆనందాలను మనకి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఎప్పటికీ జరగకుండా మనం జాగ్రత్త పడాలి. లేదంటే భారీ మూల్యం తప్పదు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Quote : కొందరు వ్యక్తులు మనం ఆనందంగా ఉంటే చూడలేరు. వారు తెలివిగా ఏమి చేస్తారంటే.. నీ సంతోషమే నా సంతోషం అంటూ మన పక్కన చేరుతారు. అప్పుడు వారు అనుకున్న పనులు మొదలు పెడతారు. మన ఆనందాలు, సంతోషాలను మన నుంచి దూరం చేస్తూ ఉంటారు. మనకు వచ్చే అవకాశాలను కూడా దారి మళ్లేలా చేస్తారు. అందుకే ఇలాంటి ప్రతికూలమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటివారో గుర్తించి.. వాటికి మనం ఎత్తుకు పైఎత్తులు వేసి ముందుకు సాగిపోవాలి. లేదంటే మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది.

ఎందుకంటే.. మన ఆనందం, సంతోషమే.. సంతోషంగా ఉంటామనే ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉంటాము. అలా వెళ్లే బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఆనందం మనకు ఇస్తుంది. దానిని మన లైఫ్ నుంచి తీసేస్తే.. మనం కృంగిపోతాము. ముందుకు వెళ్లలేము. అక్కడితోనే ఆగిపోవడమో.. స్ట్రక్ అయిపోవడమో జరుగుతుంది. సంతోషమే సగం బలం అని ఊరికే అనలేదు. నిజంగానే సంతోషమే సగం బలం ఇస్తుంది. అది మనం శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ ఉండేందుకు సహాయం చేస్తుంది. కాబట్టి.. మన సంతోషం, ఆనందంపైనే.. మన విజయం ఆధారపడి ఉంటుంది.

కాబట్టి మన జీవితాన్ని నియంత్రించడానికి మనం ఎవరినీ అనుమతించకూడదు. దీనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మొహమాటంతోనో.. లేక భయంతోనో.. ప్రేమతోనే మనం ఇతరులకు మనల్ని నియంత్రించే అవకాశాన్ని ఇచ్చేస్తాం. అప్పుడు మనం జీవించాలని కోరుకుంటున్నట్లుగా మన లైఫ్ ఉండదు. కాబట్టి మీరు ఎవరితో ఉన్నా.. మీ జీవితంపై మీకు మాత్రమే నియంత్రణ ఉండాలి. మీరు తప్ప మరెవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు.

మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో.. ఏది మీకు దుఃఖాన్ని కలిగిస్తుందో మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతికూలమైన వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. లేదా వాళ్లు మీ ఆనందాన్ని దోచుకోకుండా జాగ్రత్త పడాలి. అలాంటి వారు మన జీవితంలో రాకుండా ఆపలేము కాబట్టి.. ఎవరూ మీ జీవితంలోకి రావాలో మీరే నిర్ణయించుకోండి. ఈ వ్యక్తులు మీకు ఎప్పుడూ మంచి చేయరు. మంచిగా నటిస్తారు అంతే. మీ విషయంలో మీరు క్లారిటీగా ఉన్నప్పుడే ఈ విషయాలు మీరు గుర్తిస్తారు.