తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Upsc Official App । ఇకపై యూపిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఫోన్‌లోనే, ఒరిజనల్ యాప్ లింక్ ఇదే!

UPSC Official App । ఇకపై యూపిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఫోన్‌లోనే, ఒరిజనల్ యాప్ లింక్ ఇదే!

HT Telugu Desk HT Telugu

29 September 2022, 21:17 IST

    • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా UPSC Andriod App ను లాంచ్ చేసింది. ఇకపై అన్ని నోటిఫికేషన్లు ఈ యాప్ ద్వారానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. UPSC అధికారిక యాప్ లింక్ ఇక్కడ అందిచాము.
UPSC Official App
UPSC Official App

UPSC Official App

UPSC పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలా, ఒక సరికొత్త ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఆవిష్కరించింది. ఈ UPSC మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే నేరుగా కమీషన్ పరిధిలో జరిగే అన్నీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్‌ కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ఈ UPSC మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ ద్వారా అభ్యర్థులు కేవలం సమాచారాన్ని మాత్రమే పొందగలరు. UPSC యాప్‌ను ఉపయోగించి ఎలాంటి దరఖాస్తును పూరించటానికి వీలుపడదు.

UPSC ఇచ్చిన పత్రికా ప్రకటనలో, కమిషన్ ఈ విధంగా తెలియజేసింది: “ మీ మొబైల్ ద్వారానే పరీక్షలు, రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారాన్ని పొందుటకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు UPSC Andriod App ను గూగుల్ ప్లే స్టోర్‌లో లాంచ్ చేసింది. ఈ యాప్ మొబైల్ ఉపయోగించి అప్లికేషన్ ఫారమ్‌లను పూరించడానికి అనుమతించదు." అని పేర్కొంది.

పోటీ పరీక్షల నిర్వహణతో పాటు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే విధానం UPSCలో తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్‌మెంట్ వ్యవహారాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రతీసారి UPSC వెబ్‌సైట్‌ని సందర్శించాల్సిన అవసరం లేదు. UPSC యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సమాచారం నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు. ఇతర అలర్ట్స్ ను ఎప్పటికప్పుడు పొందే వీలుంటుంది. పరీక్షలు, ఖాళీల ప్రకటనలకు సంబంధించిన శెడ్యూల్, నోటిఫికేషన్‌లు యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

UPSC ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి దశలు:

  • Google Play storeని సందర్శించండి
  • UPSC- Official App అని సెర్చ్ చేయండి.
  • ఇన్‌స్టాల్ బటన్‌పై క్లిక్ చేయండి
  • యాప్‌ని తెరిచి, అప్‌డేట్‌ల కోసం తనిఖీ చేయండి

లేదా

సులభంగా ఈ లింక్ ( https://play.google.com/store/apps/details?id=com.upsc.upsc ) క్లిక్ చేసి కూడా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచు.

అయితే, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను UPSC అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టులో, UPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. భవిష్యత్తులో ఏదైనా UPSC పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, అందులో సూచించిన విధంగా వారి ప్రాథమిక వ్యక్తిగత సమాచారాన్ని పూరించాలి.