అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్.. వివరాలు ఇవే
11 June 2022, 21:36 IST
- UPSC Recruitment 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇతర పోస్టుల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
UPSC Recruitment 2022
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు ఇతర పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు UPSC అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2022. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
సైంటిఫిక్ ఆఫీసర్ - 1 పోస్ట్
అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్: 21 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 2 పోస్టులు
అర్హతలు:పైన పేర్కొన్న పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, ప్రతి పోస్ట్‌కు అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ద్వారా అర్హతకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కూడా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. SC/ ST/ PWBD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు
ఇతర వివరాలు
కేటగిరీల వారీగా కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్ తర్వాత మొత్తం మార్కులలో 100కు గాను UR/EWS-50 మార్కులు, OBC-45 మార్కులు, SC/ST/PwBD-40 సాధించి ఉండాలి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం UPSC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.