తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Upsc Civils Coaching : సివిల్స్‌ ఫ్రీ కోచింగ్

UPSC Civils Coaching : సివిల్స్‌ ఫ్రీ కోచింగ్

HT Telugu Desk HT Telugu

26 July 2022, 14:18 IST

    • ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షల నిర్వహణ కోసం ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
సివిల్స్‌కు ఉచిత శిక్షణ
సివిల్స్‌కు ఉచిత శిక్షణ

సివిల్స్‌కు ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. 2023లో జరిగి సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు ఉచిత శిక్షణ అందించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులతో పాటు ఇతర వర్గాల పట్టభద్రులైన అభ్యర్ధులు ఈ శిక్షణా కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ పరీక్షల కోసం ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ పొందడానికి ఆన్‌లైన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌ల ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తారు.

స్టడీ సర్కిల్‌లో శిక్షణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వార్షిక ఆదాయం రూ.6లక్షలకు మించకూడదు. పూర్తి వివరాలు www.apstdc.apcfss.inలో లభిస్తాయి. వెబ్‌ లింక్‌ ద్వారా ఆగష్టు 10వ తేదీలోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం