తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Upsc అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

UPSC అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

15 July 2022, 16:08 IST

    • సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల సంబంధించిన ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లను UPSC విడుదల చేసింది. అభ్యర్థులు UPSC అధికార వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
UPSC CAPF AC Admit card 2022
UPSC CAPF AC Admit card 2022

UPSC CAPF AC Admit card 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం నిర్వహించే పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CAPF అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆగస్టు 7న నిర్వహించబడుతుంది. మొదటి పేపర్‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 253 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్‌ఎఫ్‌లో 66, సీఆర్‌పీఎఫ్‌లో 29, సీఐఎస్‌ఎఫ్‌లో 62, ఐటీబీపీలో 14, ఎస్‌ఎస్‌బీలో 82 ఖాళీలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

పరీక్షా సరళి

రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్-1, పేపర్-2

పేపర్ I: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్- 250 మార్కులు - ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు

పేపర్ 2- జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్- 200 మార్కులు

ఎంపిక ప్రక్రియ

మొదట రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)కి పిలుస్తారు. పీఈటీలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. వ్రాత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక కోసం తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు

టాపిక్

తదుపరి వ్యాసం