తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Turmeric Milk: మీకు ఈ సమస్యలు ఉంటే పొరపాటున కూడా పసుపు పాలు తీసుకోకండి!

turmeric milk: మీకు ఈ సమస్యలు ఉంటే పొరపాటున కూడా పసుపు పాలు తీసుకోకండి!

HT Telugu Desk HT Telugu

27 August 2022, 22:57 IST

    • turmeric milk: పసుపు పాలు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అయితే, పసుపు పాలు కొన్ని సందర్భాలలో తీసుకోకపోవడం మంచిది
turmeric milk
turmeric milk

turmeric milk

ఆయుర్వేదంలో పసుపును చాలా ప్రయోజనకరమైన ఔషధంగా పరిగణిస్తారు. పసుపులోని ఔషధ గుణాలు అనేక రకాల చికిత్సలలో (టర్మరిక్ మిల్క్ రెమెడీ) దివ్యౌషధం. కాబట్టి చాలా మంది పాలలో పసుపు కలుపుకుని తాగడం అలవాటుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పసుపు, పాలు రెండిటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. పసుపు పాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో వాటిని తీసుకోకపోవడం మంచిది. పసుపు పాలు ఎటువంటి సందర్భంలో తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

ఈ పరిస్థితిలో పసుపు పాలకు దూరంగా ఉండాలి

హైపోగ్లైసీమియా - రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు వైద్యుల సలహా మేరకు పసుపు పాలు తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. హైపోగ్లైసీమియా ఉన్న రోగులు పసుపు పాలు తీసుకోవడం ద్వారా వారి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తగ్గించవచ్చు

అజీర్ణం- అజీర్ణం ఉన్నవారు.. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా పసుపు పాలు తీసుకోకూడదు. అటువంటి పరిస్థితిలో, పసుపు వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరం.

రక్త హినత- మీ శరీరంలో ఐరన్ లోపం ఉంటే పసుపు పాలు తీసుకోకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

కిడ్నీ డిజార్డర్స్- కిడ్నీకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, పసుపు పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నప్పుడు పసుపు పాలు తీసుకోకూడదు. పసుపులో ఆక్సలేట్ ఉంటుంది, ఇది కిడ్నీ స్టోన్ సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలకు దూరంగా ఉండాలి.

పాలలో పసుపు ఎంత మోతాదులో వేయాలి

పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ పసుపు వేడి కలిగించే గుణం ఉంటుంది. పాలలో పసుపు చిటికెడు కలపి తీసుకుంటే మంచిది. వాటితో ఒక గ్లాసు పాలలో చిటికెడు పంచదార వేసుకుంటే సరిపోతుంది.