పసుపును ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు!-insteadofbenefitsmoreturmericcancauseharmwetellyouhow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పసుపును ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు!

పసుపును ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు!

HT Telugu Desk HT Telugu
Aug 12, 2022 11:17 PM IST

పసుపును అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పసుపును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే నష్టాలను తెలుసుకుందాం. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు

side effects of turmeric
side effects of turmeric

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును అనేక సంవత్సరాలుగా వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ రకాల వంటకాలకు రుచిని పెంచడం కోసం ఉపయోగిస్తారు. రుచికే కాదు ఆరోగ్య పరంగానూ పసుపు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు పాలు, పసుపు నీరు, పసుపు డికాక్షన్ వంటి పానీయాలు తీసుకుంటారు. పసుపు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయో కానీ కొన్నిసార్లు పసుపును అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. సాధరణంగా వీటిలోని ఉండే యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధులను నివారిస్తాయి.మొటిమలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో పసుపును తినకుండా ఉండమే మంచిది. అలాంటి సందర్భాలను ఓ సారి చూద్దాం.

కీడ్నిలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు పసుపు ఎక్కువగా తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకు పసుపును వాడాలి. తరచుగా రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును తీసుకుంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల, పసుపు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, రక్తం పల్చగా ఉండటానికి మందులు ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, పసుపును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తాన్ని తగ్గించవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా ముక్కు నుండి లేదా శరీరంలోని ఇతర భాగాల నుండి రక్తం కారడం వంటి సమస్య ఉన్నవారు పసుపు తీసుకోవడం చాలా తగ్గించాలి. ఇందులో ఎలాంటి అజాగ్రత్త ఉన్న వారికి హాని కలిగిస్తుంది.

కామెర్లు అంటే జాయింటిస్ సమస్య ఉన్నవారు పసుపు తినకూడదు. ఈ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా పసుపును మీ వైద్యుని సలహా తర్వాతే తిసుకోవాలి.

ఒక టీస్పూన్ పసుపులో 170-190 mg కర్కుమిన్ ఉంటుంది. రోజుకు 400 mg కంటే తక్కువ లేదా 800 mg కంటే ఎక్కువ కర్కుమిన్ తీసుకోవడం సురక్షితం. కాబట్టి, సాధారణ వ్యక్తులు, ఒక రోజులో 1 నుండి 3 టీస్పూన్ల పసుపును తీసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం