Amul milk price hike: అమూల్ పాల ధర పెరిగింది.. ఎంతంటే?-prices of amul gold shakti and taaza milk brands increased by rs 2 per litre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amul Milk Price Hike: అమూల్ పాల ధర పెరిగింది.. ఎంతంటే?

Amul milk price hike: అమూల్ పాల ధర పెరిగింది.. ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 02:28 PM IST

Amul Milk price hike: అమూల్ పాల ధర పెరిగింది.

అమూల్ పాల ఉత్పత్తులను చూస్తున్న వినియోగదారుడు
అమూల్ పాల ఉత్పత్తులను చూస్తున్న వినియోగదారుడు (REUTERS)

ఆనంద్, ఆగస్టు 16: గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తన పాల ఉత్పత్తుల ధరలు పెంచింది. అమూల్ బ్రాండ్‌ పేరుతో ఈ పాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది.

అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. కొత్త ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని జీసీఎంఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

‘జీసీఎంఎంఎఫ్ గుజరాత్‌, ఢిల్లీ - ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబై, అమూల్ పాలను విక్రయించే ఇతర మార్కెట్‌లలో లీటరుకు 2 రూపాయల చొప్పున పాల ధరలను పెంచాలని నిర్ణయించింది’ అని ఆనంద్ ప్రధాన కార్యాలయ సమాఖ్య తెలిపింది.

అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్‌లలో ఇప్పుడు 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్ ధర రూ. 31, అమూల్ తాజా-రూ. 25, అమూల్ శక్తి రూ. 28గా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా అమూల్ పాల ధరలను పెంచిన తరువాత మదర్ డెయిరీ దాని సేకరణ, ఇతర ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా బుధవారం నుండి అమలులోకి వచ్చేలా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.

మార్చిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మదర్ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచింది. మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్‌లో ప్రముఖ పాల సరఫరాదారులలో ఒకటి. పాలీ ప్యాక్‌లలో, వెండింగ్ మెషీన్ల ద్వారా రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా విక్రయిస్తుంది.

ధరల పెంపు నేపథ్యంలో ఫుల్ క్రీమ్ మిల్క్ ధర బుధవారం నుంచి రూ. 61కి చేరుకుంది. టోన్డ్ మిల్క్ ధరలు రూ. 51కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరు రూ. 45కి పెరగనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ. 53కి పెరిగింది.

బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ. 46 నుంచి రూ. 48కి పెంచారు. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని సంబంధిత అధికారి తెలిపారు.

ముడి పాల సేకరణ ధరలు దాదాపు 10-11 శాతం పెరిగాయి. అదే విధంగా మేత, దాణా ధర కూడా గణనీయంగా పెరిగింది.

IPL_Entry_Point

టాపిక్