తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : పక్కనోళ్ల గురించి మనకెందుకు.. నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కో

Sunday Motivation : పక్కనోళ్ల గురించి మనకెందుకు.. నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కో

15 January 2023, 4:00 IST

    • Sunday Motivation : ఎప్పుడూ ఎదుటివాళ్లని సంతోష పెట్టడం కోసం కాకుండా.. మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ లైఫ్​పై ఫోకస్ చేయండి. మీరు భవిష్యత్తులో ఏమి సాధించాలి అనుకుంటున్నారనేదే మీకు ముఖ్యమై ఉండాలి. మీరు ప్రేమించే వాళ్లు మీ ముందున్నా.. మీ మొదటి ప్రాధాన్యత కచ్చితంగా మీరై అయి ఉండాలి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : ఈరోజుల్లో త్యాగాలు అనేవి కేవలం మాటలు వరకే పరిమితం అయిపోయాయి. నీకోసం అది చేస్తాము.. నీకోసం ఇది చేస్తాము అనేవారే కానీ.. నిజంగా అవసరమైనప్పుడు ఎవరూ మీకు దగ్గరగా ఉండరు. మీ కష్టాలను, మీ కన్నీలను మీరే దాటాల్సింది. ఎవరూ తోడుగా రారు. కాబట్టి ఎవరి గురించో ఆలోచిస్తూ మీ లైఫ్ కరాబ్ చేసుకోకండి. ఎవరి లైఫ్​లో వాళ్లు బిజీగానే ఉంటారు. కలిసినప్పుడు నాలుగు కబుర్లు చెప్తారు. కుదరనప్పుడు ఓ ఫోన్ చేస్తారు. మీరు కాకుండా వాళ్లకి మరో లైఫ్ ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తున్నారేమో అని మీరు పొరబడకండి.

ఎవరో ఏదో చేస్తున్నారు.. మనం వారికి ఇంకేదే చేయాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ముందు మీ సంతోషం మీద ఫోకస్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఎదుటివారిని హ్యాపీగా ఉంచవచ్చు. అది కాదు నేను నా సంతోషాన్ని వాళ్ల కోసం త్యాగం చేస్తాను.. నేను బాధపడుతూ వారిని మరింత హ్యాపీగా చూస్తాను. నేను కొవ్వొత్తిని, ఐస్​క్రీమ్​ని.. కరిగిపోతూ ఎదుటివారికి సంతోషాన్ని ఇస్తాను అంటే అది వేస్ట్ ముచ్చటే. మీరు కరగడం సంగతి ఏమో కానీ.. ఒక్కసారి మీరు కరగడం ప్రారంభిస్తే.. మిమ్మల్ని పూర్తిగా కరింగిచేవాళ్లు మీ చుట్టూనే ఉంటారు.

మన చుట్టూ ఉన్నవారిని హ్యాపీగా చూసుకోవాలి అనుకోవడం మంచిదే. వారి కన్నా మనం హ్యాపీగా ఉన్నామో లేదో చూసుకోవాలి. సాయం చేయడం తప్పుకాదు. కానీ అప్పు తీసుకుని మరీ సాయం చేయడం మూర్ఖత్వం. మన దగ్గర ఉంటే పక్కన వాళ్లకి ఇవ్వొచ్చు కానీ.. మనమే నానకష్టాలు పడుతుంటే ఎదుటివారు కోసం భారం తలపై వేసుకోవడం మరింత మూర్ఖత్వం. ఇకనుంచి మీ సంతోషంపైన ఫోకస్ చేయండి. ఎదుటివారికి నిజంగా మీ సాయం అవసరం అనుకుంటే పక్కనే ఉండండి. మీరున్నారనే ధైర్యమివ్వండి. అంతేకానీ అడగకుండా సాయం చేయకండి. మీరు హెల్ప్ చేస్తున్నారు కదా అని మిమ్మల్ని క్రెడిట్​కార్డులా వాడేసే వారు చాలామందే ఉన్నారు.

స్వార్థంలో నిండిన ఈ లోకంలో మన పట్ల మనం కాస్త స్వార్థం కలిగి ఉండడంలో ఎలాంటి తప్పులేదు. నీ భవిష్యత్తు ఏంటి అనేది ఎవరో నిర్ణయించరు. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది జరగట్లేదా నువ్వు రాంగ్ ట్రాక్​లో ఉన్నట్లే. అలా ఉన్నప్పుడే మీ తప్పులను గుర్తించి మళ్లీ ప్రయత్నించండి. మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఏదొక టైమ్​లో సక్సెస్ అవుతారు. లేదా ప్రయత్నిస్తూ మీరు ఓ గమ్యాన్ని చేరుకుంటారు. పక్కనోడి లైఫ్​పై పెట్టే శ్రద్ధ ఏదో.. మీ జీవితంపై పెడితే బాగుపడతారు.