Thursday Motivation : మీ గోల్‌ని కాదు.. మీ ప్లాన్‌ని మార్చండి.. సక్సెస్ అవుతారు..
Thursday Motivation : మీరు మీ గోల్స్ రీచ్ కావట్లేదు అంటే మీరు మార్చుకోవాల్సింది గోల్స్ కాదు. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఛేంజ్ చేసుకోవాలి. ఒకటే మూసధోరణిలో ప్రయత్నించడం ఆపి.. వివిధ విధాలుగా ప్రయత్నిస్తే.. మీకు కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.
Thursday Motivation : అందరూ ఒకేసారి.. ఒకే ప్రయత్నంలో సక్సెస్ కాలేరు. దాని అర్థం మనకి చేత కాదు అని కాదు. మన ప్రయత్నంలో ఎక్కడో తెలియకుండా తప్పు చేస్తున్నామని. మరోసారి ప్రయత్నించేప్పుడు ఆ తప్పును సవరించుకుని ట్రై చేయాలి. అంతే కానీ.. మనకి చేతకాదు అని.. లేదా మనం చేయలేమని గోల్‌ని వదులేయకూడదు. రూట్ మార్చి ప్రయత్నించాలి అంతే.
కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా.. మనతోని కావట్లేదని పక్కకి తప్పుకుంటాము. లేదంటే దానిపైన ఆశలు వదిలేసి.. మనకు ఇంతే ప్రాప్తం అనుకుంటామని లైట్ తీసుకుంటాము. అయితే ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనం ప్రయత్నించాలే కానీ.. ఏదైనా సాధించగలము అనే నమ్మకం మనపై మనకి ఉన్నప్పుడు కచ్చితంగా అది సాధిస్తాము. లేదంటే దానికంటే బెటర్ పొందుతాము. మీరు గోల్ రీచ్ అవ్వట్లేదని బాధపడుతున్నప్పుడు.. ఫేమస్ పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా. అంతే.. మనం సక్సెస్ అవ్వడం లేట్ అవ్వొచ్చు ఏమో కానీ.. కచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఈ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు.. మీరు కచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు.
మనం ఏదైనా సాధించలేకపోయినప్పుడు కచ్చితంగా నిరాశలో ఉంటాము. ఉండాలి కూడా. ఎందుకంటే మనం గట్టిగా ప్రయత్నించినప్పుడు దానిని పొందలేనప్పుడు కొంత నిరాశ పడాలి. కానీ వెంటనే మనల్ని మనం మరో ప్రయత్నానికి సిద్ధం చేసుకోవాలి. ఆ సమయంలో మనం పరిస్థితులను ఎదుర్కోవడం కాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ.. మీరు ఎంత త్వరగా ఈ వాస్తవాన్ని.. ఫలితాన్ని స్వీకరిస్తే.. అంత త్వరగా మీరు గెట్ ఆన్ అవ్వొచ్చు. పైగా నిరాశలో ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించాలి.. లేదా అవి రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా మీరు వాస్తవాన్ని స్వీకరించి అడుగు ముందుకు వేయాలి.
మనల్ని ఏ పని చేయడానికైనా ప్రేరేపించేది మన స్వశక్తి మాత్రమే. మనం కచ్చితంగా చేయగలం అనుకుంటేనే.. బరిలోకి దిగుతాము. చేయకూడదు అనుకుంటే ఆగిపోతాము. చేయాలా వద్దా అనేది మనమే డిసైడ్ అవుతున్నప్పుడు.. మన ప్రేరణ కూడా మనమే కావాలి. ఈ విషయం తెలియక చాలా మంది తమ గోల్స్‌తో రాజీ పడతారు. వాస్తవానికి మనం మార్చుకోవాల్సింది లక్ష్యాలు కాదు.. మనం చేసిన తప్పులను గుర్తించి.. యాక్షన్ ప్లాన్ మార్చుకోవాలి. మరో రకంగా.. మరో ప్లాన్‌తో.. మరోసారి ప్రయత్నించాలి. రాకుంటే మళ్లీ ప్రయత్నించాలి. ఇలా ఎన్నాళ్లు చేసుకుంటూ పోవాలి రిజల్ట్ రాకుండా అనుకోవచ్చు. మీరు గోల్ రీచ్ కాకపోయినా.. ఈ ప్రాసెస్‌లో మీ నైపుణ్యాలు కచ్చితంగా మెరుగుపరచుకుంటారు. అవి మీరు మరోరకంగా అయినా సక్సెస్ అయ్యేలా చేస్తాయి. సో డోంట్ వర్రీ.
సంబంధిత కథనం