Tuesday Motivation : సరైన వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలంటే.. మీరు ఏమి చేయాలో తెలుసా?
Tuesday Motivation : అందరికీ మంచి వ్యక్తులే భాగస్వామిగా వస్తారని చెప్పలేము. కొందరు సరైన భాగస్వామిని ఎన్నుకోలేకపోవచ్చు. లేదా తమకు సరికానీ వ్యక్తితో రిలేషన్లో ఉండాల్సి రావొచ్చు. మీరు కూడా ఓ టాక్సిక్ రిలేషన్లో ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఏమి చేయాలో తెలుసా?
Tuesday Motivation : ఎవరి జీవితంలోనైనా ఓ భాగస్వామిని ఎన్నుకోవడం చాలా కష్టం. అందులోనూ మనకు పర్ఫెక్ట్ మ్యాచ్ వెతుక్కోవడం కష్టమే. అయితే వచ్చే భాగస్వామి పర్ఫెక్ట్ కాకపోయినా.. టాక్సిక్ పర్స్‌న్ అయితే.. ఆ బంధం నరకమే. మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే, మీకు నచ్చే వ్యక్తి భాగస్వామిగా ఉంటే మీరు లక్కీ అనే చెప్పాలి. కానీ మీరు ఓ టాక్సిక్ రిలేషన్లో ఉన్నా.. లేక మీరు ఆ బంధాన్ని కొనసాగించాల్సి వచ్చినా మీరు ఏమి చేయాలో తెలుసా?
మనం మనకి సరికానీ వ్యక్తితో ఓ రిలేషన్లో ఉన్నప్పుడు.. ఆశలన్నీ వదిలేసి.. ఇంక మనం జీవితం ఇంతే అని బాధపడతాము. సరైన వ్యక్తిని ఎప్పటికీ పొందలేమని అనుకుంటాము. కానీ.. మీ జీవితంలో సరైన వ్యక్తిని పొందాలంటే.. ముందు మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పర్సన్‌ని వదిలేయాలి. ఓ బంధాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కొన్ని బంధాలు కలిసి ఉండడానికి చాలా కారణాలే ఉండి ఉంటాయి. ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉంటున్నారంటే.. మీకు చాలా రీజన్స్ ఉండి ఉండొచ్చు. కానీ ఆ కారణాలను మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగితే.. మీ జీవితంలో.. మీకు సరైన వ్యక్తిని పొందే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
అలా అని.. చిన్న చిన్న కారణాలతో అన్ని బంధాలను వదిలేయమని కాదు. కొందరికి మీ కారణాలు సిల్లీగా అనిపించవచ్చు. కానీ మీకు అవి చాలా పెద్ద మ్యాటర్ అయి ఉండొచ్చు. ముందు మీ భాగస్వామికి వారి తప్పులను, లేదా మీ ఇష్టాలను చెప్పి చూడండి. వారికి మారే అవకాశం ఇవ్వండి. అప్పటికి మారలేదంటే.. మీరు వారిని వదిలేయడమే కరెక్ట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే.. మీ జీవితంలో ఉన్న టాక్సిక్ వ్యక్తి.. లేదా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయవచ్చు. వారు భావోద్వేగాలతో ఆడుకోవచ్చు. ఇలా మిమ్మల్ని బెదిరించే వారి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇలా బెదిరించే వారు ఎప్పటికీ.. వాళ్లు ప్రాణాలు తీసుకోరు. వాళ్లు గురించి మీరు వారితో కలిసి ఉండి మీరు ఇబ్బంది పడటం తప్ప.. ఇంకేమి ఉండదు. తప్పుడు వ్యక్తులు ఎల్లప్పుడూ మీపై ఒత్తిడి తీసుకువచ్చి.. మిమ్మల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మీరు బంధాలకు విలువ ఇస్తారని వారికి తెలుసు కాబట్టి.. మిమ్మల్ని ఎలా అయినా బ్లాక్ మెయిల్ చేసి.. వారి జీవితంలో ఉంచుకోవాలని చూస్తారు.
అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మీరు చేయగలిగే గొప్ప పని. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండడం తప్పేమి కాదు. ఓ సరైన వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే.. మీరు ఆ టాక్సిక్ పర్సన్‌కి దూరంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ఒకవేళ మీ లైఫ్‌లోకి ఎవరిని ఆహ్వానించాలని లేకుంటే.. మీరు సొంతంగా బతకగలిగే ధైర్యం మీకు ఉంది. అలాంటి టాక్సిక్ పర్సన్‌ని వదిలించుకోగలిగారంటేనే అర్థం అవుతుంది మీకు ఎంత ధైర్యం ఉందో. సో మీరు సింపుల్‌గా.. సింగిల్‌గా కూడా లైఫ్ లీడ్ చేయగలరు. కానీ ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. బానిసత్వానికి బాయ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకండి. మీరు ఎంత ఆలస్యం చేస్తే.. మీ పరిస్థితి అంత చేజారిపోతుంది.
సంబంధిత కథనం