Friday Motivation : మీకు కావాల్సింది పర్​ఫెక్ట్​ కాదు.. నిజమైన ప్రేమ..-friday motivation on love doesn t need to be perfect it just needs to be true ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : మీకు కావాల్సింది పర్​ఫెక్ట్​ కాదు.. నిజమైన ప్రేమ..

Friday Motivation : మీకు కావాల్సింది పర్​ఫెక్ట్​ కాదు.. నిజమైన ప్రేమ..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 08, 2022 08:05 AM IST

Friday Motivation : ప్రేమ అనేది ఎప్పుడూ పర్​ఫెక్ట్​గా ఉండాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ అనేది పర్​ఫెక్ట్​గా లేకపోయినా ఉంటుంది. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అలాంటిది మీరు ప్రేమించిన వ్యక్తి మాత్రం పర్​ఫెక్ట్​గా ఎలా ఉంటారు. వారి దృష్టిలో వారికి పర్​ఫెక్ట్​ అనిపించింది మీకు అనిపించకపోవచ్చు. కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తి ఎలా ఉన్నారో.. వారిని అలానే యాక్సెప్ట్ చేయండి. ఏమో మీ ప్రేమే వారిని మీకు నచ్చినట్టు మార్చవచ్చేమో..

మీకు కావాల్సింది నిజమైన ప్రేమ
మీకు కావాల్సింది నిజమైన ప్రేమ

Friday Motivation : ప్రేమ పర్​ఫెక్ట్​గా ఉండాల్సిన అవసరం లేదు. ఇదే నిజం కూడా. దీనిని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. సినిమాల్లో చూపించినట్లు ఓ జంట పర్​ఫెక్ట్​గా ఉన్నారని.. రియాలటీలో కూడా అలాగే ఉండాలని కోరుకునే వారు చాలామందే ఉన్నారు. కానీ నిజానికి ఎవరూ పర్​ఫెక్ట్​గా ఉండరు. ప్రేమలో పర్​ఫెక్ట్​గా లేకపోయినా పర్లేదు కానీ.. నిజంగా ఉండాలి. నిజమైన ప్రేమ ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. మీరు పర్​ఫెక్ట్​గా ఉన్నా లేకపోయినా.. లేదా మీ భాగస్వామి పర్​ఫెక్ట్​గా ఉన్నా లేకపోయినా వారితోనే ఉంటుంది. వారికి తోడుగా, నీడుగా ఉంటుంది. గట్టిగా మాట్లాడాలి అంటే నిజమైన ప్రేమ దొరకడమే కష్టం. అలా దొరికిన దానిని వదులుకున్నారంటే మీకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండురు.

జీవితంలో ఏదీ అంత పరిపూర్ణంగా ఉండదనే వాస్తవం తెలసినా.. దానిని మరచిపోయి పరిపూర్ణమైన విషయాల కోసం మనం ఎదురుచూస్తాము. కానీ రోజు చివరిలో మీ సంబంధం ఎంతవరకు నిజమనేది మీకు సరైన సమాధానం ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏ విషయమైనా.. ఎంత సంపద ఉన్నా మీకు సంతృప్తిని ఇవ్వదు. భౌతిక ఆనందాలు మీ స్థితిని పెంచవచ్చు కానీ.. మీరు వెతుకుతున్న సంతృప్తిని మాత్రం ఇవ్వదని గుర్తించుకోండి.

కాబట్టి మీకు కావాల్సింది నిజమైన ప్రేమనే అని తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఇతరులతో నిజాయితీగా ఉండాలి. అప్పుడే మీకు విషయాలు అనుకూలంగా పని చేస్తాయి. ధనం, అందం ఉన్నాయా అనే ఆలోచించే బదులు.. ఆ వ్యక్తి ఎంత వరకు నిజాయితీ ఉన్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వ్యక్తి మీకు నిజమైన ప్రేమను అందించగలడు. ప్రతి వ్యక్తి తన సొంత మార్గంలో పర్​ఫెక్ట్​గానే ఉంటారు. ప్రతి ఒక్కరికి లోపాలు ఉంటాయి. అంతెందుకు మీలో కూడా లోపాలు ఉండే ఉంటాయి. కానీ మీకు నచ్చినట్టు అవతలి వ్యక్తి మారాలంటే మీ ప్రేమ నిజమైనదే అయి ఉండాలి. మీరు మారమాని చెప్పకపోయినా.. వారు మీకోసం వారికి తెలియకుండానే మారిపోతారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్