Wednesday Motivation : మీ జీవితంలో వారికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? అయితే ఇప్పుడు చెప్పండి..-wednesday motivation on wakeup each day and be thankful for life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : మీ జీవితంలో వారికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? అయితే ఇప్పుడు చెప్పండి..

Wednesday Motivation : మీ జీవితంలో వారికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? అయితే ఇప్పుడు చెప్పండి..

Wednesday Motivation : ఈరోజు నిద్రపోతే.. రేపు లేస్తామో లేదో తెలియదు. అలాంటి ఈ జీవితంలో మీకు జరిగే ప్రతి మంచికీ థాంక్​ఫుల్​గా ఉంటున్నారా? కనీసం ఉదయం లేవగానే మరొక రోజుని చూసే లక్ మీకు దొరికిందని హ్యాపీగా ఎప్పుడైనా ఫీల్​ అయ్యారా? అయితే మిమ్మల్ని నడిపించే శక్తికి ఓ థ్యాంక్స్ చెప్పండి.

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : ఎన్నో ఆలోచనలతో.. ఏవో భయాలతో.. ఎన్నో అనుమానాలతో రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఓ యుద్ధం చేస్తారు. ఆ రోజు జరిగిన ఏదొక సంఘటన మనల్ని వెంటాడుతుంది. ఒక్కోసారి ప్రశాంతంగా నిద్రపోలేము. ఒంటరితనం వల్ల కలిగే భయమో.. అందరితో కలిసి ఉండాల్సి వస్తుందనే వేదనో.. మానసికంగా, శారీరకంగా పడుతున్న ఇబ్బందుల కారణంగానో.. రేపు నిద్రలేస్తామా అనే ఆలోచన ఏదొక రోజు.. ఏదొక టైమ్​లో.. ఏదొక కారణం చేత.. మనకు వస్తుంది.

మీరు అలా ఆలోచించిన రోజూ.. హాయిగా పడుకోలేరు. కానీ తెలియకుండా నిద్ర పట్టి.. లేచేసరికి మరో రోజు మనకోసం ఎదురు చూస్తుంది. మీరు అలా నిద్రలేచిన రోజు.. మీరు ఆరాధించే దేవునికి ఓ థ్యాంక్స్ చెప్పండి. దేవుడిని నమ్మకపోయినా.. మనల్ని నడిపించే శక్తి ఏదొకటి ఉందని అందరికీ తెలుసు కాబట్టి.. ఆ నడిపించే శక్తికి థ్యాంక్స్ చెప్పండి. ఇది మీ రోజు పాజిటివ్​గా మారుస్తుంది. మనకు జరిగే ప్రతి మంచికి కృతజ్ఞతతో కలిగి ఉండడం మనకే మంచిది.

మనం దేనినైనా కోల్పోయేవరకు దాని విలువ తెలియదు. ఒక్కోసారి తెలుసుకోము కూడా. ఆ రోజు లేదా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మనకు దూరం అయినప్పుడు మాత్రమే మనం దాని విలువను గుర్తిస్తాము. మన దగ్గర లేనప్పుడు దాని విలువ తెలిసుకుని లాభం లేదు. మన దగ్గరున్నప్పుడే దాని విలువ గుర్తిస్తే.. దానిని మరింత జాగ్రత్తగా, పదిలంగా చూసుకుంటాము. అలాగే మనుషులు దగ్గరున్నప్పుడు వారి విలువ గుర్తించము. వారిని చులకనగా చూస్తాము. వారికి ఎప్పుడూ థ్యాంక్స్ కూడా చెప్పము.

మన తల్లిదండ్రులు, ప్రేమించేవారు, స్నేహితులు ఇలా మన చుట్టూ ఉన్నవారు మనకు చాలా విషయాల్లో వారి తాహతకు తగ్గట్లు మనకు సహాయం చేస్తారు. కానీ అప్పుడు వారు చేస్తున్న హెల్ప్ గుర్తించము. వారు మనకు దూరమయ్యాక.. వారు చేసిన సహాయం విలువ తెలుస్తుంది. కానీ అప్పుడు వారికి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా మనకి దొరకదు. కాబట్టి మీకు ఎవరైనా.. చిన్నదైనా, పెద్దదైన సహాయం చేస్తే.. వారికి థ్యాంక్స్ చెప్పండి. రేపు మీరు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. లేదంటే మీకు సహాయం చేసేవాళ్లు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజే మీకు మంచి చేసిన వాళ్లకి ఓ థ్యాంక్స్ చెప్పండి. మీ శత్రువుకు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చినా అహానికి పోకుండా.. ఓ థ్యాంక్స్ చెప్పండి. మీకు వారికి మధ్య ఉన్న గొడవలను కూడా దూరం చేస్తుంది. ఎవరినైనా బాధపెట్టాను అనిపిస్తే ఓ సారి చెప్పండి. ఏమి ఖర్చుకాదు. మీ గౌరవం ఎక్కడా తగ్గదు.

సంబంధిత కథనం