Saturday Motivation : మిమ్మల్ని ప్రేమించేవారికి.. మీకు ఎలాంటి ప్రేమ కావాలో ఎప్పుడైనా చెప్పారా?-saturday motivation on how you love yourself is how you teach others to love you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : మిమ్మల్ని ప్రేమించేవారికి.. మీకు ఎలాంటి ప్రేమ కావాలో ఎప్పుడైనా చెప్పారా?

Saturday Motivation : మిమ్మల్ని ప్రేమించేవారికి.. మీకు ఎలాంటి ప్రేమ కావాలో ఎప్పుడైనా చెప్పారా?

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 22, 2022 06:56 AM IST

Saturday Motivation : ఇప్పుడే కాదు.. ఎప్పటికైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థమైన చర్య కాదు. ఇది ప్రతి ఒక్కరికీ అవసరం. పైగా ఇది మిమ్మల్ని ప్రేమించాలి అనుకునే వారికి ఓ బెంచ్ మార్క్ లాంటిది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే.. వారికి మీరు చెప్పారా మిమ్మల్ని ఎలా ప్రేమించాలో? మీకు ఎలాంటి ప్రేమ కావాలో..

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : ప్రతి ఒక్కరూ అందరి కంటే ఎక్కువగా తమని తాము ప్రేమించుకోవాలి. ఇతరుల కంటే మనల్ని మనమే ఎక్కువ ప్రేమించుకోవాలి. ఇదేమి సెల్ఫిష్ చర్య కాదు. ఇలా అనుకుంటున్నారు అంటే.. వాళ్లకి ప్రేమించకోవడం, ప్రేమించడం రెండూ రావానే అర్థం. వాళ్లకి ప్రేమించడం రాదు కాబట్టే మీ ప్రేమను అర్థం చేసుకోకుండా.. మీ ప్రేమకు వాల్యూ ఇవ్వడం లేదు. కాబట్టి అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిమల్ని మీరు హ్యాపీగా ప్రేమించుకోండి. మీరు లైఫ్​లో హ్యాపీగా ఎలా ఉండాలో అదే నేర్పిస్తుంది.

సెల్ఫ్ లవ్​ అనేది నేటి ప్రపంచంలో కచ్చితంగా అవసరం. ఇది మీరు ఇండిపెండెంట్​గా.. మీకు ఎవరూ తోడు లేకపోయినా.. మీకు మీరు ఉన్నారనే ధైర్యం ఇస్తుంది. తనకు తానుగా సహాయం చేసుకునేవారికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అంటారు. అందుకే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకి మనం వాల్యూ ఇవ్వాలి. ఎదుటివారు మాట వినొద్దు అని కాదు. ఎవరి మాటా విన్నా.. సలహా తీసుకున్నా.. చివరికి మీ మాటపై మీరు నిలబటం నేర్చుకోవాలి.

అంతే కాదు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? లేదా ప్రేమిస్తున్నా అని చెప్పారా? అయితే మీకు ఎలాంటి ప్రేమ కావాలో వారికి చెప్పండి. అడగనిదే అమ్మ అయినా పెట్టదంటారు.. మరి ఎవరో మీకు కావాల్సిన ప్రేమను ఎలా ఇస్తారు. వాళ్లు చూపించే కేర్​నేగా ప్రేమగా చెప్తే సరిపోదు కదా.. మీకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఎలా ప్రేమిస్తే బాగుంటుందో.. ఎలా ప్రేమించాలో చెప్పండి. అది తప్పేమి కాదు. వాళ్లు ప్రేమిస్తున్నారు కదా అని.. వాళ్ల ప్రేమ నచ్చినా.. నచ్చకపోయినా.. ఇబ్బంది పెడుతున్నా.. మీరు అడ్జెస్ట్ అయ్యి.. బాధపడాల్సిన అవసరం లేదు. మీరు క్లారిటీగా ఉన్నారనుకోండి.. వాళ్లు కూడా మిమ్మల్ని మీకు నచ్చినట్లు ప్రేమించగలుగుతారు. వాళ్లకి నిజంగా మీపై ప్రేమ ఉంటే.. మీకు నచ్చిన ప్రేమనే వారు ఇస్తారు. లేదంటే వదిలి వెళ్లిపోతారు.

మీ బెంచ్ మార్క్ మీరే సెట్ చేసుకోండి. అదే మిమ్మల్ని మంచి స్థానంలో ఉంచుతుంది. మిమ్మల్ని ప్రేమించే వారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన ఇష్టాలకు కచ్చితంగా ప్రాధన్యం ఇచ్చుకోవాలి. సిగ్గు, మొహమాటంతో కాంప్రిమైజ్ అయ్యారనుకో.. చివరికి మిమ్మల్ని మీరు కోల్పోతారు. అది ఎప్పటికీ జరగకూడదంటే.. ఏవిషయంలో కాంప్రిమైజ్ అయినా సరే.. మీ విషయంలో, మీ సంతోషం విషయంలో కాంప్రిమైజ్ అవ్వకండి.

మన సొంత నైపుణ్యాలను మనం విలువైన వాటిగా తీసుకోవాలి. మనం కనే కలలు.. వాటిని సాధించగలమనే నమ్మకం.. దానికోసం మనం చేసే పనులు.. ఇవన్నీ మీకు సక్సెస్​ని దగ్గర చేస్తాయి. మీలోని బెటర్ పర్సెన్​ని దగ్గరకి చేస్తాయి. సమాజం మనతో ఎలా ప్రవర్తించాలో చెప్పే ముందు.. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన సొంత జీవితం ముఖ్యమని గుర్తించుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం