Good Morning Quotes | మంచి ఆలోచనలతో మీరోజును ప్రారంభించండి.. శుభోదయం!
ఉదయాన్ని మంచి ఆలోచనలతో ప్రారంభిస్తే రోజంతా మంచే జరుగుతుందని చెప్తారు. మీరు మంచి ఆలోచనలు చేసేలా, మీలో స్ఫూర్తి నింపేలా ఇక్కడ కొన్ని సూక్తులు ఉన్నాయి.. తప్పకుండా చదవండి, షేర్ చేయండి.. శుభోదయం.
ప్రతిరోజూ ఒక కొత్త రోజే. ఒక కొత్త అవకాశమే. మనం రోజును ఏ విధంగా, ఎంత ఉత్సాహంతో అయితే ప్రారంభిస్తామో.. రోజంతా మనం అంతే ఉత్సాహంతో పనిచేస్తాం. కాబట్టి ఎల్లప్పుడు పాజిటివ్ దృక్పథంతో రోజును ప్రారంభించాలి. లేవగానే మనకు నచ్చిన పనిచేయాలి. భగవంతుణ్ని నమ్మేవారు మందిరానికి వెళ్లి ప్రార్థన చేయాలి. లేదా సూర్యనమస్కారాలు చేయాలి. యోగా, ధ్యానం లేదా మరేదైనా అలవర్చుకుంటే శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, హుషారుగానూ ఉంటుంది. నచ్చిన అల్పాహారం చేయండి.. సరైన డైలీ రొటీన్ కలిగి ఉంటే క్రమక్రమంగా మీరు అనవసరపు విషయాలపై ఆందోళనలను విడిచిపెట్టి, ఒక ఆశావాద దృక్పథంతో జీవిస్తారు.
నిరాశ, నిసృహలతో భారంగా జీవితం గడపటం. రేపటి నుంచైనా మంచి రోజులు వస్తాయా అంటూ ఆలోచిస్తూ కూర్చోవటం అనవసరం. మీ ముందు ఉన్నది ఈరోజు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? నిన్నటి కంటే మన ఉత్పాదకత ఎలా పెంచుకోవాలి? నిన్నటి కంటే గొప్పగా ఎలా పనిచేయాలి వంటి ఆలోచనలు చేస్తూ ఆ దిశగా కార్యాచరణకు సిద్దం కావాలి.
మంచో, చెడో ఏదైతే అదవనీ.. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి.. మిగతా ఏం జరగాలో అది జరుగుతుంది. ఏం జరిగినా సిద్ధంగా ఉండాలి. ఎప్పటికైనా పోరాడేవాడే విజేత అవుతాడు. ఒక ఫైటర్ గా మరికొంత మందికి స్ఫూర్తినిస్తాడు. అది మీరే ఎందుకు అవ్వకూడదు.
అంతా మీ ఆలోచనల్లోనే ఉంటుంది. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మీకు ఈరోజు అంతా మంచే జరగాలి అని కోరుకుంటూ మీలో స్ఫూర్తినింపే కొన్ని సూక్తులను ఇక్కడ అందిస్తున్నాం. మీకు నచ్చింది మీ వాట్సాప్, ఫేస్ బుక్ ఎక్కడైనా షేర్ చేయండి. మరికొంత మందిలో స్ఫూర్తి నింపండి. శుభోదయం.
Good Morning Messages, Quotes- Telugu
జీవితం ఒక యుద్ధభూమి..
ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది.
ఊరికే ఉంటే ఏముంటుంది!
శుభోదయం!!
పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు.
మన ప్రవర్తన, మన చేతలే మనల్ని
గొప్పవారిగా మారుస్తాయి.శుభోదయం!
అహం వల్ల ఏర్పడే అంధకారం
కారుచీకటి కంటే భయకరంగా ఉంటుంది.
అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..!
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే
చింతలులేని జీవితం నీ సొంతమవుతుంది..
శుభోదయం..
నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే
మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
శుభోదయం.
సంబంధిత కథనం