Friday Motivation : ఒంటరితనం అనేది బలహీనత కాదు.. మనకి మనం ఇచ్చుకునే ధైర్యం..-friday motivation on courage naturally appears once you realize you are alone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : ఒంటరితనం అనేది బలహీనత కాదు.. మనకి మనం ఇచ్చుకునే ధైర్యం..

Friday Motivation : ఒంటరితనం అనేది బలహీనత కాదు.. మనకి మనం ఇచ్చుకునే ధైర్యం..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 21, 2022 06:43 AM IST

Friday Motivation : సాధారణంగా చాలా మంది ఒంటరిగా ఉండడానికి భయపడతారు. కానీ కొన్ని పరిస్థితులు వారిని ఒంటరిగా మిగిల్చేస్తాయి. అయితే ఆ సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోనే వారు ఎప్పటికీ.. దేనికీ భయపడరు. ఎందుకంటే సింగల్​గా ఉన్నప్పుడు మనకు మనం ఇచ్చుకునే ధైర్యాన్ని.. మరెవరు.. ఎవరికీ.. ఇవ్వలేరు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : చాలామంది ఒంటరిగా ఉండటం అంటే బలహీనత అనుకుంటారు. లేదా వాళ్లు ప్రేమించినా వారో.. కుటుంబసభ్యులో ఉంటే.. వారే తమ ధైర్యం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఒంటరిగా ఉండటం ప్రారంభిస్తే.. అదే మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది.

నిజానికి బంధాలు అనేవి మనల్ని బలహీనం చేస్తాయి. ఏ పనికైనా ఇతరులపైనే ఆధారపడేలా చేస్తాయి. నా వాళ్లు ఉన్నారులే.. వాళ్లు చూసుకుంటారులే.. వాళ్లు కాపాడుతారులే అనే భావన మనల్ని బలహీనులుగా మార్చేస్తుంది. కానీ ఏదైనా పరిస్థితుల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తే.. అది మీ మొత్తం లైఫ్​నే మార్చేస్తుంది.

ఒక్కోసారి ఒంటరిగా ఎలా అవుతామంటే.. వాళ్లు చనిపోయినప్పుడు.. లేదా వాళ్లు తిరిగిరారు అనుకున్నప్పుడు.. లేదా మనమే వారి నుంచి దూరంగా వెళ్లిపోయినప్పుడు ఒక్కసారిగా ఒంటరిగా మారిపోతాము. మొదట్లో ఏ పని చేసుకోవడమైనా కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు మరీ ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వెళ్లడం నుంచి.. తిరిగి సేఫ్​గా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చినా ఒంటరిగా ఉండడమనేది కూడా కష్టంతో కూడిన పనే. ఆ స్థాయి నుంచి.. పని మీద వెళ్లినా.. ఇంటికి లేట్​నైట్ రావాల్సి వచ్చినా.. తెలియకుండా మనలో ఓ ధైర్యం వచ్చేస్తుంది.

అప్పుడు మన చుట్టు పక్కల ఉన్నవాళ్లు కూడా షాక్ అవుతారు. అప్పుడు ఎలా భయపడేది.. ఇప్పుడు ధైర్యంగా అయిపోయింది అనేవాళ్లు ఉంటారు. బరితెగించింది అని తేడాగా మాట్లాడేవాళ్లు కూడా ఉంటారు. అయితే మరికొందరైతే.. మా పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపమమ్మ అనుకుంటూ.. వారిని ఇంట్లోనే పంజరాలుగా మార్చేస్తారు. ఇక వారు కూడా నిజమేనేమో.. మనం బయటకు వెళ్తే బతకలేమేమో అనే ధోరణిలో ఆగిపోతారు.

అలా కాకుండా.. మీ పిల్లలను బయటకు పంపండి. ఒంటరిగా వారి జీవితాన్ని అర్థం చేసుకోనివ్వండి. మీరే కాదు.. ఎవరూ జీవితాంతం తోడు ఉండరు. తోడు ఉంటాను అని చెప్పినా.. మధ్యలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకేసారి వాళ్లకి ఎవరైనా దూరం అయితే ఎలా బతకాలో కూడా తెలియదు. కాబట్టి.. ముందు నుంచే, వారి బంగారు భవిష్యత్తు కోసం.. పిల్లలకు తమ ప్రైవసీని ఇవ్వండి. వాళ్లు చేసుకోగలిగే అన్ని పనులు వారితోనే చేయించండి. అప్పుడు మీరు దూరమైనా.. వాళ్లు ధైర్యంగా బతకగలుగుతారు. అప్పుడు ఒంటరితనం అనేది వారికి బలహీనత కాకుండా ఉంటుంది. ఒంటరిగా ఉండడం అనేది మీరు ఇచ్చే బలం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. పిల్లలకు కనీసం ఫ్రీడమ్ ఇవ్వండి.

WhatsApp channel

సంబంధిత కథనం