Saturday Motivation : తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉండాలి.. లేదంటే తప్పే చేయకూడదు
Saturday Motivation : మీరు తప్పు చేసినప్పుడు.. దానిని అంగీకరించడం చాలా ముఖ్యమైన విషయం. తప్పను ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. చిన్నదైనా పెద్దదైనా అది తప్పే కాబట్టి.. మీరు దానిని ఒప్పుకునే తీరాలి. సరే మీరు తప్పు చేయలేదు. ఎదుటివాళ్లు మీ మాట వినాలని అనుకోకుండా.. తప్పు మీదే అంటూ నిందిస్తుంటే.. ఆ సమయంలో సైలెంట్‌గా ఉండడమే బెటర్.
Saturday Motivation : ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. అది ఏదైనా కానీ.. తెలిసో, తెలియకో తప్పు చేస్తారు. కానీ అందరికీ తప్పు ఒప్పుకునే ధైర్యం ఉండదు. తప్పును ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మనం దానిని అంగీకరించాలి. దాని వల్ల కలిగే నష్టమేమి లేదు. ఇది మీకు కొత్త విషయాలు నేర్చుకునే స్కోప్ ఇస్తుంది. ఎదుటివారికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. తప్పు చేస్తే నమ్మకం పెరగడం ఏంటి అనుకుంటున్నారా? తప్పు చేసినందుకు కాదు.. తప్పును ధైర్యంగా ఒప్పుకున్నందుకు ఎదుటివారు మీపై నమ్మకాన్ని పెడతారు.
కొందరు తప్పు చేసినా.. తమది తప్పే కాదంటూ సమర్థించుకుంటారు. అది తప్పు అని ఎదుటి వారు చెప్పినా దానిని అంగీకరించరు. వారిలోనే అహమే తప్పు అంగీకరించకుండా చేస్తుంది. మీరు చేసింది ఒప్పు అయినప్పుడు మీరు దానిని అర్థమయ్యేలా చెప్పాలి. వారు వినే స్టేజ్‌లో లేనప్పుడు వారికి అర్థం చేసుకునే సమయం ఇవ్వాలి.
తప్పు ఒప్పుకోవడం అనేది మీరు నిజాయితీగా ఉండే మార్గాన్ని మరింత బలంగా చేస్తుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారు. తప్పు కావాలాని చేయలేదు. తెలియకుండా జరిగిపోయిందనో.. లేదా ఆ తప్పు ఎందుకు జరిగిందో.. లేదా మంచి కోసమే ఆ తప్పు చేయాల్సి వచ్చిందో అని అన్ని విధాలుగా ఆలోచిస్తారు. దీనివల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే కచ్చితంగా మీరు తప్పుచేస్తే.. దానిని ఒప్పుకునే తీరాలి.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తప్పు ఒప్పుకున్నంత మాత్రానా మీరేమి అందరికంటే తక్కువ అయిపోరు. ప్రతి ఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తారు. అవి వారు చేశామని ఒప్పుకోలేరు కాబట్టి.. మేము తప్పు చేయలేదనే గర్వం చూపిస్తారు. కానీ వాళ్లు కూడా తప్పు చేసే ఉంటారు. అలాంటి వారిని చూసి.. మీ తప్పును ఒప్పుకోకుండా ఉండకండి. కానీ ఆ తప్పును తిరిగి మళ్లీ చేయకండి.
ఒకవేళ ఎదుటివారు మీ తప్పు లేకపోయినా.. మిమ్మల్ని నిందిస్తున్నారనుకోండి అప్పుడు సైలంట్‌గా ఉండండి. చాలా మంది నిజాన్ని అరిచి చెప్తారు. కానీ అరిచి మీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం తప్పా.. ఇంకేమి ఉండదు. ఎందుకంటే.. అప్పుడు మీ మాట వినే స్థితిలో ఎవరూ ఉండరు. కాబట్టి.. మీరు సైలెంట్‌గా ఉండి.. పరిస్థితి అర్థం చేసుకుంటూ.. సమయం వచ్చినప్పుడు.. మీరు నిజాన్ని ధైర్యంగా చెప్పండి. కానీ అప్పటివరకు ఓపికతో ఉండడం చాలా కష్టం. వారు మీ మాట వినేలా చేయడం చాలా ముఖ్యం. అరిచి చెప్తే.. మాత్రం వారు వినేందుకు సిద్ధంగా ఉండరు.
సంబంధిత కథనం