Thursday Motivation | నిజాయితీగా, కరెక్ట్​గా ఉంటే చాలు.. ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్-thursday motivation on if you do it right one life is enough ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation | నిజాయితీగా, కరెక్ట్​గా ఉంటే చాలు.. ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

Thursday Motivation | నిజాయితీగా, కరెక్ట్​గా ఉంటే చాలు.. ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

HT Telugu Desk HT Telugu
May 12, 2022 08:02 AM IST

మీ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.. ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకున్నది ఒకటంటే ఒకటే లైఫ్.

ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్
ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

Thursday Motivation | నిరంతర విందులు, ఉల్లాసంగా ఉండటం ఆనందాన్ని ఇచ్చేవే. కానీ ఇవి సంతృప్తినిస్తాయని అనుకోకండి. ఇది చివరికి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది కూడా. అందుకే వీలైనంత ఆనందాన్ని అనుభవించండి. మంచి స్నేహితులను ఎంచుకుని.. ప్రతికూల వ్యక్తులను నివారించండి. ఫలవంతమైన, సానుకూల మార్గాల్లో... వ్యక్తిగా నిరంతరం అభివృద్ధి చెందండి. జ్ఞానాన్ని నేర్చుకోండి. పంచుకోండి.

మీరు కష్టాల్లో కూరుకుపోయి ఇతరులను తప్పించడంలో అర్థం లేదు. ఇతరులకు హెల్ప్ చేసి మీరే ఏడుస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఒకరికి హెల్ప్ చేయడమనేది తప్పుకాదు కానీ.. దీర్ఘకాలం వరకు విచారకరమైన ఆలోచనలు, దుఃఖం ఇచ్చే ఫలితాలు మాత్రం మీకు కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిరుత్సాహంలో ఉంటే.. మంచి స్నేహితులను కనుగొనండి. మిమ్మల్ని ఎక్కువగా నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. ఇది అనేక రకాల అనారోగ్యాలను నయం చేస్తుంది. అప్పుడు మీరు మరణ శయ్యపై ఉన్నా.. మీరు ఈ జీవితం పట్ల సంతృప్తి చెందుతారు. ఏమి చేయాలనుకున్న ఈ జీవితంలోనే ఫుల్ ఫిల్ చేసుకోండి. ఇంకో లైఫ్​ ఉంటుందా లేదా అనే ప్రశ్నే ఉండదు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్