Tuesday Motivation : నలుగురిలో ఉంటూ బాధపడడం కన్నా.. ఒంటరిగా ఉండడమే బెటర్..-tuesday motivation some times we sit alone in silence than with people who judge the way i live ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : నలుగురిలో ఉంటూ బాధపడడం కన్నా.. ఒంటరిగా ఉండడమే బెటర్..

Tuesday Motivation : నలుగురిలో ఉంటూ బాధపడడం కన్నా.. ఒంటరిగా ఉండడమే బెటర్..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 11, 2022 06:29 AM IST

Tuesday Motivation : ఒక్కోసారి మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాము. ఎందుకంటే.. మనం జీవించే విధానాన్ని జడ్జ్ చేసేవాళ్లకన్నా.. మనతో మనం సైలంట్​గా టైం స్పెండ్​ చేయడమే మంచిది. అదే మనకి అన్నింటికన్నా క్వాలిటీ టైమ్​ అనిపిస్తుంది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ నాతో లేరే అని ఎప్పుడూ బాధపడకండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : కొందరు ఇతరులను జడ్జ్ చేసేందుకే పుడతారేమో. వాళ్లు ఎలా ఉంటున్నారు.. ఏమి చేస్తున్నారు.. వారిలో లోపాలు ఏంటి.. వాళ్లు చేసే తప్పులేంటి.. అని లెక్కలేస్తూ ఉంటారు. అంతటితోనే ఆగుతారా అంటే లేదు. మన దగ్గరకే వచ్చి.. నువ్వు అలా ఉంటున్నావు.. ఇలా ఉండాలి.. ఇలా ఉండకు అంటూ చెప్తూ.. ఫ్రీగా జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేస్తారు. మన పరిభాషలో చెప్పాలంటే నస పెడ్తారు.

మనకి నచ్చి.. లేక నచ్చకపోయినా.. ఓ కంఫర్ట్​బుల్​ లైఫ్​లో లేదా.. మనకో క్లారిటీ ఉండి.. తర్వాత ఏమి చేయాలో అనే లైఫ్​లో మనం ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు.. కొందరు వచ్చి సలహాల పేరుతో వాళ్ల ఆలోచల్ని మనపై రుద్దేస్తారు. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే.. అరె నేను నిజంగానే తప్పు చేస్తున్నానామో అనిపిస్తుంది. మన వైపు నుంచి కాకుండా వాళ్ల వైపు నుంచి చూస్తూ.. మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసుకుంటాం. అప్పుడు వాళ్లు మనతో ఉంటారా అంటే లేదు. వాళ్లు ఎప్పుడో మనల్ని వదలేసి పోతారు. అలాంటి వాళ్ల సలహాలు పట్టించుకుని.. మీకు నచ్చిన జీవితాన్ని వదులుకోకండి.

మీకు ఏమి చేయాలో అనేదానిపై క్లారిటీ ఉన్నప్పుడు.. ఎవరూ ఎన్ని చెప్పిన వినకండి. అలాంటి వాళ్లతో కూర్చొని సమయాన్ని వృథా చేసుకునే బదులు.. మీతో మీరు కూర్చొని.. ఎంజాయ్ చేయండి. అలా ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ బాధపడకండి. ఒంటరితనం మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఒంటరిగా ఉన్నామని.. ఎవరిని పడితే వాళ్లని దగ్గరకు రానివ్వకండి. ఒంటరిగా ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్లతో మన ఫీలింగ్స్, మన సమస్యలు చెప్పేసే అవకాశముంది. వాళ్లు వాటిని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కూడా. అలా ఎవరైనా వస్తే.. మీకు మీరు కూడా దొరకరు. ఎందుకంటే.. వాళ్లు మన పర్సనల్ స్పేస్​ని తీసేసుకుంటారు కాబట్టి. ఎవరైనా వస్తే బాగుంటాది అనుకున్నా.. వాళ్లు మిమ్మల్ని జడ్జ్​ చేస్తుంటే మాత్రం అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా వెళ్లిపోండి.

పక్కనోడి లైఫ్​ అంటే ప్రతి ఒక్కరు ఐన్​స్టీన్​లా ఫీల్​ అయిపోతారు. ఏవేవో సిద్ధాంతాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొందరు మంచి సలహాలు ఇస్తారు. మరికొందరు సలహాల పేరుతో.. మనలోని కాన్ఫిడెన్స్​ని దెబ్బతీస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎండ్​ ఆఫ్​ ద డే మీతో మీరే ఉంటారు. కాబట్టి.. మీ బుర్రను, మీ క్లారిటీని దెబ్బతీసే వారికి దూరంగా ఉండండి. మీ గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ ఫీల్ అవ్వకండి. ఇతరులతో ఉండి.. మిమ్మల్ని మీరు కోల్పోవడం కన్నా.. మీతో మీరు ఉంటూ.. ఓ చక్కని లైఫ్​ లీడ్​ చేయడం చాలా మంచిది.

WhatsApp channel

సంబంధిత కథనం