Saturday Quote: చుట్టూ అందరూ ఉన్నా.. మీకు ఎవరూ లేరనే ఫీల్ రావడమే నిజమైన ఒంటరితనం-saturday motivational quote on lonely is not a feeling when you are alone lonely is a feeling when no one cares ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Quote: చుట్టూ అందరూ ఉన్నా.. మీకు ఎవరూ లేరనే ఫీల్ రావడమే నిజమైన ఒంటరితనం

Saturday Quote: చుట్టూ అందరూ ఉన్నా.. మీకు ఎవరూ లేరనే ఫీల్ రావడమే నిజమైన ఒంటరితనం

Saturday Quote : ఒంటరిగా ఉండటాన్నే చాలా మంది లోన్లీగా ఉండటం అనుకుంటారు. అది అస్సలు కాదు. అందరిలో ఉన్నా.. అందరూ మీతో ఉన్నా.. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడమే లోన్లీనెస్. మీ చుట్టూ 100మంది ఉన్నా.. వారు ఎవరూ మీ హృదయానికి దగ్గరగా రావట్లేదు అనిపించినప్పుడే మీరు నిజంగా లోన్లీగా ఫీల్​ అవుతారు.

కోట్ ఆఫ్ ద డే

Saturday Quote : సింగిల్​ ఉండటమనేది ఓ రకంగా బ్లెస్సింగ్. ఎందుకంటే ఫేక్ మనుషుల మధ్య ఉండటం కన్నా అదే బెటర్ అని మీకు చాలాసార్లు అనిపిస్తుంది. మీరు సింగిల్​గా ఉన్నప్పుడు కన్నా… పదిమందితో ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అవుతారు చూడండి అదే నిజమైన ఒంటరితనం. సింగిల్​గా ఉంటే ఒంటరి అనే ఫీల్ వస్తుందనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు మీలా ఉంటారు. ఎవరి వల్ల సమస్యలుండవు. ఎవరి గురించి ఆలోచించనవసరం లేదు. మీకు నచ్చినట్లు ఉండే ఏకాంత సమయం ఎప్పుడూ ఒంటరిగా అనిపించదు.

పైగా ఏకాంతంగా గడిపినప్పుడు బోర్​ కొట్టే ఫీల్​ని ఒంటరితనం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు తర్వాత ఏమి చేయాలా అని ఆలోచిస్తారు. దానికి తగ్గట్లు పని చేస్తారు. మీతో జీవితాంతం ఉంటామని చాలా మంది మీకు మాటాలు చెప్తారు. కానీ మీకు అవసరమైన సమయంలో ఎవరూ ముందుకు రారు. ఆ సమయంలో మీరు లోన్లీగా పీల్ అవుతారు. మీకు ఎవరూ లేరని మీకు తెలిసినప్పుడు కలిగే భావోద్వేగమే ఒంటరితనం.

ఒంటరితనం అనేది ఓ రకమైన అనుభూతి. ఇది మీ చుట్టూ ఉన్నవారు మీకు క్రియేట్ చేసిన ఓ భావోద్వేగం. అది మిమ్మల్ని కృంగదీస్తుంది. ఎవరి మీద డిపెండ్ అయి లేరనుకో మీకు ఈ ఫీల్ కచ్చితంగా రాదు. ఎవరినుంచి అయినా.. ఏదైనా ఆశించినప్పుడు మాత్రమే ఇలా అనిపిస్తుంది. మనం దగ్గరగా ఉన్నప్పుడు నటిస్తూ.. దూరంగా ఉన్నప్పుడు పట్టించుకోనివారు మన లైఫ్​లో చాలా మందే ఉంటారు. కొందరు దగ్గరున్నా పట్టించుకోరు. అలాంటి సమయంలో మీరు లోన్లీగా ఫీల్​ అవుతారు. కానీ ఈ విషయాలపై మీకో క్లారిటీ వచ్చేస్తే.. మీరు ఎప్పటికీ లోన్లీగా ఫీల్​ అవ్వరు.

మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పు ప్రతికూల ఆలోచనలు వెంటాడుతాయి. కొన్ని సమయాల్లో అవి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. తెలియకుండా అది మీ జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తుంది. మీకు మనుషుల మీద విరక్తిని కలిగిస్తాయి. కాబట్టి మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి. ఎవరో వచ్చి.. ఏదో చేస్తారని ఎప్పుడూ ఆలోచించకండి. పరిస్థితుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీరు రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

సంబంధిత కథనం