అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి.. బంధాలు నిలుస్తాయి!-negative thoughts you need to let go off for better relationships ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి.. బంధాలు నిలుస్తాయి!

అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి.. బంధాలు నిలుస్తాయి!

Apr 20, 2022, 05:10 PM IST HT Telugu Desk
Apr 20, 2022, 05:10 PM , IST

  • 'మీరు మారాలి, చెప్పినట్లు వినాలి' అంటూ ఒకరిని బలవంతం చేయడం. వారు మారకపోతే గట్టిగా అరవడం, మీ దారిలోకి తెచ్చుకునేందు ప్రయత్నాలు చేయడం వల్ల మీది పైచేయి అవుతుందేమో కానీ ఇలాంటి అలవాట్లతో మీ బంధాలకు బీటలు వారడం ఖాయం. మీలో ఈ చెడు అలవాట్లను చెక్ చేసుకోండి..

నేటి ఆధునిక జీవనశైలిలో ఖాళీ సమయం దొరకడం అనేదే కష్టంగా ఉంటుంది. దొరికే ఆ కొద్ది సమయం గొడవలకే కేటాయిస్తే చివరకు మిగిలేది శూన్యం. మౌనం ఎన్నో విధాల మంచిదంటున్నారు సైకాలజిస్టులు. ఇంకా వారు ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి.

(1 / 10)

నేటి ఆధునిక జీవనశైలిలో ఖాళీ సమయం దొరకడం అనేదే కష్టంగా ఉంటుంది. దొరికే ఆ కొద్ది సమయం గొడవలకే కేటాయిస్తే చివరకు మిగిలేది శూన్యం. మౌనం ఎన్నో విధాల మంచిదంటున్నారు సైకాలజిస్టులు. ఇంకా వారు ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి.(Pixabay)

వ్యక్తులను ఏదోరకంగా మీ దారికి తెచ్చుకోవచ్చు. వారిపై వాదించి గెలవవచ్చు. కానీ ఒకరిని మీకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం వృధానే. మీ ఆత్మీయులే మీకు ప్రత్యర్థులుగా మారవచ్చు.

(2 / 10)

వ్యక్తులను ఏదోరకంగా మీ దారికి తెచ్చుకోవచ్చు. వారిపై వాదించి గెలవవచ్చు. కానీ ఒకరిని మీకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం వృధానే. మీ ఆత్మీయులే మీకు ప్రత్యర్థులుగా మారవచ్చు.(Pixabay)

ఒక్కోసారి ఎదుటివారి వ్యవహారశైలి మీకు నచ్చకపోవచ్చు. దీనిని మీరు సహనం కోల్పోయి అరుస్తూ, కేకలు వేయడం చేస్తే. దీంతో మీకు ఆత్మసంతృప్తి లభించవచ్చు. కానీ ఆ వ్యక్తి మీపై విశ్వాసం కోల్పోతారు. ఇక వారి విశ్వాసం మీరు తిరిగి ఎన్నటికీ పొందలేరు.

(3 / 10)

ఒక్కోసారి ఎదుటివారి వ్యవహారశైలి మీకు నచ్చకపోవచ్చు. దీనిని మీరు సహనం కోల్పోయి అరుస్తూ, కేకలు వేయడం చేస్తే. దీంతో మీకు ఆత్మసంతృప్తి లభించవచ్చు. కానీ ఆ వ్యక్తి మీపై విశ్వాసం కోల్పోతారు. ఇక వారి విశ్వాసం మీరు తిరిగి ఎన్నటికీ పొందలేరు.(Pixabay)

ఒకరిపట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడం, ఇంకొకకరిని విస్మరించడం చేస్తే పరిస్థితులు దిగజారుతాయి. రిలేషన్ దెబ్బతింటుంది.

(4 / 10)

ఒకరిపట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడం, ఇంకొకకరిని విస్మరించడం చేస్తే పరిస్థితులు దిగజారుతాయి. రిలేషన్ దెబ్బతింటుంది.(Pixabay)

ఏ సందర్భంలోనైనా ఆచుతూచి మాట్లాడాలి. అధికారంతో, అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడితే ఆ మాటలే మిమ్మల్ని వెంటాడుతాయి. మీ పతనాన్ని శాసిస్తాయి.

(5 / 10)

ఏ సందర్భంలోనైనా ఆచుతూచి మాట్లాడాలి. అధికారంతో, అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడితే ఆ మాటలే మిమ్మల్ని వెంటాడుతాయి. మీ పతనాన్ని శాసిస్తాయి.(Unsplash)

వ్యక్తులను ఇంకొకరితో పోల్చకూడదు. వారు ఎక్కువ, వీరు తక్కువ, వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు లాంటి మాటలు వద్దు.

(6 / 10)

వ్యక్తులను ఇంకొకరితో పోల్చకూడదు. వారు ఎక్కువ, వీరు తక్కువ, వారెలా ఉన్నారు, వీరెలా ఉన్నారు లాంటి మాటలు వద్దు.(Pixabay)

ఎప్పుడు నెగెటివ్ ఆలోచనల్లో మునిగిపోవడం, ఒకరు మీకు మంచి చేయాలని చూసినా మీ అనుమానాలతో ఇతరులతో గొడవపడే ధోరణి కలిగి ఉండటం అనర్థాలకు దారితీస్తుంది.

(7 / 10)

ఎప్పుడు నెగెటివ్ ఆలోచనల్లో మునిగిపోవడం, ఒకరు మీకు మంచి చేయాలని చూసినా మీ అనుమానాలతో ఇతరులతో గొడవపడే ధోరణి కలిగి ఉండటం అనర్థాలకు దారితీస్తుంది.(Unsplash)

సరైన నిద్ర లేకపోతే మీ మానసిక స్థితిపై మీకే నియంత్రణ ఉండదు. నిద్రపై దృష్టిపెట్టండి.

(8 / 10)

సరైన నిద్ర లేకపోతే మీ మానసిక స్థితిపై మీకే నియంత్రణ ఉండదు. నిద్రపై దృష్టిపెట్టండి.(Unsplash)

సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం: మీరు మీ కోపానికి సంబంధించిన సమస్యలను క్రమబద్ధీకరించకుంటే, మీరు వ్యక్తులను శిక్షించడానికి నిశ్శబ్ద చికిత్సను ఆశ్రయించవచ్చు. మీ సమస్యల గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించడం ఈ విషపూరిత అలవాటును వదిలించుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

(9 / 10)

సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం: మీరు మీ కోపానికి సంబంధించిన సమస్యలను క్రమబద్ధీకరించకుంటే, మీరు వ్యక్తులను శిక్షించడానికి నిశ్శబ్ద చికిత్సను ఆశ్రయించవచ్చు. మీ సమస్యల గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించడం ఈ విషపూరిత అలవాటును వదిలించుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు