ఐస్ క్యూబ్‌తో మీ పార్ట్‌నర్‌కు సెగలు రేపండి.. వేసవిలోనూ శృంగారాన్ని ఆస్వాదించండి-ice cube massage boosts your sex life ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Ice Cube Massage Boosts Your Sex Life

ఐస్ క్యూబ్‌తో మీ పార్ట్‌నర్‌కు సెగలు రేపండి.. వేసవిలోనూ శృంగారాన్ని ఆస్వాదించండి

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 10:30 PM IST

దాంపత్యంలో నవరసాలు ఉండాలి, ఇందులో శృంగార రసం కచ్చితంగా ఉండాలి. చిన్న ఐస్ ముక్కతో వేడిరగిల్చే శృంగార అనుభూతికి చిట్కాలు చూడండి...

Couple Goals
Couple Goals (Stock Photo)

చలికాలం వెళ్లిపోయి వేసవి నడుస్తోంది. ఈ వేడికాలంలో మీ భాగస్వామిని చల్లగా సంతృప్తిపరచడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఎయిర్ కండీషనర్‌ని ఆన్ చేసి చల్లటి గదిలో వెచ్చగా దుప్పటికప్పుకొని పడుకోవచ్చు. ఏసి లేకపోయినా చలికాలం నాటి మధురానుభూతులను ఒక్క మంచు గడ్డతో తీసుకురావొచ్చని మీకు తెలుసా. మీ అందమైన భాగస్వామి ఒంపుసొంపులపై చల్లని ఒక మంచుగడ్డను తడుముతూపోతే నరాలు జల్లుజల్లున లేచి మీపై కలబడి ఎగబడి సెగలురేపుతుంది. ఈ తరహా చర్యలు భార్యాభర్తలిరువురి మధ్య సాంగత్యాన్ని మరింత పెంచి, బంధం మరింత దృఢం చేస్తుంది. మరి మీరు దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

అయితే ముందుగా మీ రీఫ్రిజరేటర్ నుంచి కొన్ని ఐస్ క్యూబ్ లను తెచ్చుకోండి.. వేడివేడి శృంగార వ్యాయామానికి సిద్ధంకండి.

కోల్డ్ మసాజ్

కొన్ని ఐస్ క్యూబ్ లను తీసుకోని మీ చేతుల్లో పట్టుకోండి, ఆ ఐస్ ముక్కలను మీ చేతులకు రుద్దుకొని అరచేతులను చల్లగా చేసుకోండి. ఇప్పుడు మీ చల్లని చేతులతో మీ భాగస్వామి మెడపై, భుజాలపై, నడుముపై మృదువుగా, నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇవి వారి నరాలను శాంతింపజేసి, ఇంద్రియాలను ఉత్తేజితం చేస్తాయి.

ఇక ఇప్పుడు మీ వంతు. మీరు మీ భాగస్వామికి చేసినట్లే మీ భాగస్వామిని కూడా మీకు చేయమని కోరండి. ఇలా ఒకరికొకరు చేసుకోవడం ద్వారా మీ కోరికలు ఉత్తేజితం అవుతాయి.

కోల్డ్ కిస్

ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మీ పెదాలకు రుద్దుకోండి. మీ పెదాలు పూర్తిగా చల్లబడేవరకు రుద్దుకోండి. చల్లగా మారిన ఆ పెదాలతో మీ భాగస్వామి అదరాలను కలుపుతూ ఘాడమైన చుంబనం చేయండి. కొద్దసేపటికి ఆ చల్లదనం కాస్తా వెచ్చటి అనుభూతినిస్తుంది. ఆ అనుభూతిని ఆస్వాదించండి.

హాట్ స్పాట్‌లను స్పృశించండి

మీ భాగస్వామిని పూర్తిగా నగ్నంగా మార్చిన తర్వాత ఆమె శరీరంలోని హాట్ స్పాట్‌లను గుర్తించండి. ఆ భాగాలపై ఐస్ ముక్కను ఉంచి ఆ తర్వాత తీసివేసి మీ నాలుకతో ఆ భాగాన్ని స్పృశించండి. ఐస్ క్యూబ్ చల్లదనం, మీ నాలుక వెచ్చదనం కలిసిపోయి మీ భాగస్వామిని స్వర్గపు అంచులను చేరుస్తుంది. ఆ తర్వాత మీ ఇద్దరి యుద్ధం చెమటలు చిందేలా ఉంటుంది.

ఈ తరహా ఫోర్ ప్లే చిట్కాలు పాటించడం ద్వారా భాగస్వామితో శృంగార జీవితం బాగుంటుంది. తద్వారా మీ దాంపత జీవితం ప్రేమానురాగాలతో సాగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్