Sunday Motivation : వచ్చింది కదా అవకాశం.. హ్యాపీ మూమెంట్స్​ని ఆస్వాదిద్దాం..-sunday motivation on now and then its good to pause in our pursuit of happiness and just be happy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : వచ్చింది కదా అవకాశం.. హ్యాపీ మూమెంట్స్​ని ఆస్వాదిద్దాం..

Sunday Motivation : వచ్చింది కదా అవకాశం.. హ్యాపీ మూమెంట్స్​ని ఆస్వాదిద్దాం..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 27, 2022 06:00 AM IST

Sunday Motivation : ఏదైనా బాధ కలిగినప్పుడు మనం కొన్ని పనులకు, కొన్ని బంధాలకు మధ్య బ్రేక్ తీసుకుంటాము. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే బాగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే.. ఆ సమయాన్ని.. ఆనందాన్ని మీరు ఆస్వాదించడం కోసం.. మీరు కచ్చితంగా విరామం తీసుకోవాలి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : జీవితంలో కష్ట, సుఖాలు ఉంటాయని మనకి తెలుసు. కష్టాలు రెగ్యూలర్​గా వచ్చినా.. సంతోషాలు మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి చాలా గ్యాప్ తీసుకుని.. సంతోషం మన దగ్గరికి వస్తుంది. అలా ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉంటే కాస్త రిలాక్స్ అవుతూ.. ఆ మూమెంట్​ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది.

ప్రస్తుత రోజులు ఎలా ఉన్నాయంటే.. బాధతో రోజులు తరబడి కృంగిపోతున్నాము. కానీ.. సంతోషం వస్తే.. దానిని చాలా లైట్ తీసుకుని.. మిగిలిన పనుల్లో బిజీ అయిపోతున్నాము. సంతోషాన్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని ఈ జన్మ ఎందుకు చెప్పండి. బాధ వస్తే ఎంతగా ఆలోచించి.. ఇంకా బాధపడిపోతూ.. ఎలా ఏడుస్తామో.. సంతోషానికి కూడా అంతే వాల్యూ ఇవ్వండి. పైగా సంతోషం అనేది చాలా రేర్​గా మన దగ్గరికి వస్తుంది. అప్పుడు దానిని ఆస్వాదించడం నేర్చుకోండి. మనం కష్టపడేది సంతోషంగా ఉండడానికేనని గుర్తించండి.

సంతోషంగా, ఆనందంగా గడపాలని మనం కష్టపడుతూ ఉంటాము. కానీ ఆ సంతోషాలను పక్కన పెట్టి పనుల్లో బిజీ అయిపోతాము. రోజూ మూడు పూటల నాలుగు వేళ్లు లోపలకు వెళ్లాలని అందరూ కష్టపడతారు. కానీ ఆ ఫుడ్​ని కూడా సరిగ్గా తినకుండా.. ఒకవేళ తిన్నా దానిని ఆస్వాదించకుండా.. కనీసం తిన్న తర్వాత చేయి కడిగి.. దాని తడి ఆరక ముందే పనిలో పడిపోతూ ఉంటారు. ఇక మీరు కష్టపడేది ఎందుకు చెప్పండి. మీ పిల్లలకోసం కష్టపడుతున్నారా? మీ ఫ్యామిలో కోసం కష్టపడుతున్నారా? మీకోసం కష్టపడుతున్నారా? తప్పేమి లేదు. మీరు కష్టపడితేనే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ మీరు హ్యాపీగా ఉంటేనే కదా.. కష్టపడగలిగేది.

చాలామంది పిల్లలకోసం సంపాదిస్తాము అంటారు. అలా చేయడం తప్పు కాదు. కానీ వాళ్లకి బేసిక్స్ నీడ్ ఇస్తే చాలు. వాళ్లు కూడా ఎదుగుతారు. సంపాదించుకోగలుగుతారు. మీరు ఎంత కష్టపడినా.. ఎన్ని డబ్బులు దాచినా.. ఫ్యూచర్​ని మీరు ఏమాత్రం మార్చలేరు. కాబట్టి ప్రెజంట్ మీ ఫ్యామిలీతో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అని ఆలోచించుకోండి. మంచి సినిమా చూస్తే.. దాని గురించి నలుగురికి చెప్పండి. వారితో మాట్లాడండి. నవ్వుకోండి. మంచిగా వీకాఫ్ వస్తే.. మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి.. కాసేపు కూర్చొని.. హాయిగా గడపండి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. మీ ఆనందాన్ని నలుగురిలో కాకపోయినా మీలో వెతుక్కోండి. మీరు గోల్​ని రీచ్ అయితే.. దానిని ఆస్వాదించండి. మరో గోల్​కి కాస్త సమయం తీసుకుని.. ముందు మీరు అచీవ్ చేసిన దానిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

మీ లైఫ్ మీకు నవ్వుకోవడానికి, సంతోషంగా ఉండడానికి ఛాన్స్ ఇస్తే.. దానిని పూర్తిగా ఆస్వాదించడం నేర్చుకోండి. అంతేకానీ మీరు కంగారు పెడుతూ.. ఆ సంతోషాన్ని దూరం చేసుకోకండి. మీరు ఇలానే ఉంటే.. ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. సంతోషంగా ఉండాలి అనుకుంటే సరిపోదు. అలాంటి మూమెంట్ నిజంగా వస్తే ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా మీరు ఆస్వాదించట్లేదంటే.. మీరు సంతోషంగా ఉండాలని ఆలోచించే అర్హత కూడా మీకు లేనట్లే.

WhatsApp channel

సంబంధిత కథనం