Work Relationship : కొలిగ్స్​తో సంబంధాలు ఇలా పెంచుకోండి.. వారితో కలిసి హ్యాపీగా పని చేసుకోండి..-improve your work relationship with your colleagues follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Work Relationship : కొలిగ్స్​తో సంబంధాలు ఇలా పెంచుకోండి.. వారితో కలిసి హ్యాపీగా పని చేసుకోండి..

Work Relationship : కొలిగ్స్​తో సంబంధాలు ఇలా పెంచుకోండి.. వారితో కలిసి హ్యాపీగా పని చేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 09, 2022 01:00 PM IST

Work Relationship : ఆఫీసులో ఉండే పోటీలు గురించి చాలా వినే ఉంటాము. కాంపిటేటివ్ వరల్డ్​లో ఇది చాలా సాధారణం. అయితే తరచుగా వాదనలు, అపార్థాలు ఉంటే అవి మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. మీ సహోద్యోగులతో మీ వృత్తిపరమైన సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలా ఉండకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి.

వర్క్ రిలేషన్ షిప్
వర్క్ రిలేషన్ షిప్

Work Relationship : మనం ఇంట్లో గడిపే సమయం కన్నా.. ఆఫీస్​లోనే సమయం ఎక్కువ గడుపుతాం. అదేంటి వర్క్ చేసిన తర్వాత అంతా ఇంట్లోనే ఉంటాము కదా అంటే.. అలా కాదు.. పడుకున్నప్పుడు కాకుండా.. మనం ఎక్కువ సమయం స్పెండ్ చేసేది ఆఫీస్​లోనే. అలాంటప్పుడు వర్క్ చేసే ప్రదేశంలో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. దానివల్ల వర్క్​కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పైగా మీరు వారితో కలిసి మీ పనిని మరింత సక్సెస్​ఫుల్​గా చేసుకోవచ్చు. అలా అని వారితో రాసుకుని, పూసుకుని తిరిగాలని కాదు. కానీ ఒక వెల్ మెయింటైన్​ బిహేవియర్​తో అందరితోనూ మంచిగా కలిసి వర్క్ చేసుకోవాలి.

పని విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు అంటే.. మీరు మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మీ వర్క్​నే కాదు.. మీ ప్రొడెక్ట్​విటీని కూడా పెంచుతుంది. మెరుగైన ఫలితాలు సాధించడానికి సహాయం చేస్తుంది. అయితే మీ సహోద్యోగితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఎలా కొనసాగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమ్‌వర్క్

మీరు టీమ్‌వర్క్‌ను విశ్వసిస్తే.. సానుకూల వాతావరణం ఉంటుంది. ఇలా టీమ్​గా కలిసి పని చేస్తున్నప్పుడు.. ఒకరికొకరు సపోర్ట్​ ఇచ్చుకుంటూ.. కలిగి ఎదగడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కాంపిటేషన్ ఉంటుంది. కానీ వర్క్ పరమైన కాంపిటేషన్ పెరుగుతుంది కానీ ఉద్యోగుల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు. టీమ్​గా ఎదగాలనే ఆలోచన ఎప్పుడూ మంచిదే.

ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి

ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ దాని అర్థం మీరు వారి అభిప్రాయాలను ఎగతాళి చేయాలని కాదు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు మనతో ఉద్యోగం చేస్తుంటే.. వర్క్ పరంగా వారు ఇచ్చే సలహాలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్లు చెప్పే సూచనలు మంచి ఫలితాలు ఇస్తాయోమో అని ఆలోచించాలి. మంచి ఫలితాలు లేకున్నా వారి నిర్ణయాలు గౌరవిస్తే చాలు. తర్వాత వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకానీ వాళ్లు చెప్తే నేను ఎందుకు వినాలి అనే ధోరణి కరెక్ట్ కాదు. అన్ని మనకే తెలుసు అనుకోవడం మంచిది కాదు.

గాసిప్స్ చేయకండి..

సానుకూలమైన పని-సంబంధానికి అత్యంత ముఖ్యమైన విషయం ఆఫీసు గాసిప్‌లకు దూరంగా ఉండటమే. మీరు నిరంతరం ఆఫీస్‌లో ఇతరులను విమర్శిస్తూ లేదా చర్చిస్తూ లేదా వారి గురించి గాసిప్స్ చేసుకోవడం మంచిది కాదు. అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈరోజు కాకపోయినా.. ఏదొక రోజూ మీ గురించి తెలుస్తుంది. మీరే ప్రమాదంలో పడతారు.

సహాయం

ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా మీ సహోద్యోగులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ జూనియర్స్ బాగా పని చేస్తే.. వారిని ప్రోత్సహించండి. వారు అప్​ టూ ద మార్క్​ లేకపోయినా.. వారికి ఓపికగా నేర్పించండి. వారి టాలెంట్ నిరూపించుకోవడానికి మద్దతు ఇవ్వండి.

కంపెనీ మార్గదర్శకాలను అనుసరించండి

కంపెనీ మార్గదర్శకాలను ఉల్లంఘించే ఏ పనిని ఎప్పుడూ చేయవద్దు. పనివేళల్లో పనికి విలువ ఇవ్వండి. సమయపాలన పాటించండి.

నాణ్యమైన పని

ఎల్లప్పుడూ పరిమాణం కంటే నాణ్యతను ఎంచుకోండి. ఎంత పని చేశామన్నది మ్యాటర్​ కాదు.. ఎంత నాణ్యమైన పని చేస్తున్నామనేది ఇంపార్టెంట్. మీరు చేసే పనిపై శ్రద్ధ పెట్టండి. ఇది మిమ్మల్ని కచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. పదోన్నతి ఇప్పుడు రాకపోయినా.. నిరుత్సాహపడకండి. మీ వర్క్​ని కంపెనీ గుర్తిస్తే.. అది మీకు ఏదొక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్