తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sex Can Make Your Skin Glow Immediately, Know More Benefits Of Lovemaking

Afterglow | శృంగారంతో ముఖం ప్రకాశవంతం.. ఏ ఫెయిర్‌నెస్ క్రీమ్ అవసరం లేదు!

HT Telugu Desk HT Telugu

06 December 2022, 22:40 IST

    • Afterglow: ఆడ, మగ ఇద్దరు శృంగారం చేసుకున్న తర్వాత వారి ముఖంలో కళ వస్తుందంటారు. నిజమేనా? వైద్యులు ఏమంటున్నారో చూడండి.
Afterglow
Afterglow (Pixabay)

Afterglow

ఉద్వేగభరితమైన సెక్స్ సెషన్ల మధ్య ఆవిరితో తనువులు తడిసి ముద్దవుతాయి. అది తనువునే కాదు మనసును కూడా మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. మీరు అనుభవించే ఆనందం మీ ముఖంపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెక్స్ తర్వాత మీ చర్మంలో ఒక మెరుపు వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే! హానీమూన్ వెళ్లిన నూతన వధూవరులపై అసోసియేషన్ ఫర్ సైకలాజికల్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనంలో ఇది నిరూపితమైంది. సైకలాజికల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, భాగస్వాములు సంతృప్తికరమైన శృంగారాన్ని ఆస్వాదించిన తర్వాత వారు 'ఆఫ్టర్‌గ్లో' (Afterglow) పొందుతారు. అది 48 గంటల వరకు ఉంటుంది. కాబట్టి, సెక్స్ అనేది చాలా కాలం పాటు ఉండే అందమైన ప్రయోజనాలను కలిగిస్తుందని అంగీకరించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

కాబట్టి మీ రోజువారీ చర్మ సంరక్షణ కోసం సెక్స్ చేయడం కూడా ఒక మంచి సౌందర్య సాధనమే. ఖరీదైన ఫ్యాన్సీ క్రీమ్‌లు, లోషన్‌ల వాడకం లేకుండానే మీ మనసు, తనువుకు అన్ని విధాల ప్రయోజనాలను చేకూర్చేందుకు మీ భాగస్వామితో సెక్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం.

సెక్స్ మీ చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది?

సెక్స్ మీ చర్మానికి అద్భుతాలు చేస్తుంది, మీ చర్మంలో ఒక ప్రకాశాన్ని ఇస్తుంది, మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది. శృంగార సమయంలో శరీరం ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్) అనే హార్మోన్ విడుదల చేస్తుంది. దీని వల్ల మీ శరీరం ప్రశాంతమైన అనుభూతిని పొందుతుందని గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ దివ్య తెలిపారు.

ఒత్తిడి చర్మ సమస్యలను తీవ్రతరం చేస్తుంది, వృద్ధాప్య సంకేతాలను పెంచుతుంది. అయితే సెక్స్ మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లయిన ఆక్సిటోసిన్, డోపమైన్‌లనను విడుదల చేస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే, సాధారణ లైంగిక చర్య ఆడవారిలో పెద్ద మొత్తంలో ఈస్ట్రోజెన్‌ను విడుదల చేస్తుంది, ఇది కొల్లాజెన్ క్షీణతను నిరోధిస్తుంది, యాంటీ ఏజింగ్‌లో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా కనిపిస్తుంది.

సెక్స్ అనేది రక్త ప్రసరణ రేటుతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది, దీంతో మీ రక్త నాళాలు విస్తరించి, మీ చర్మానికి మరింత రక్తం ప్రసరిస్తుంది, ఇది మీకు సహజమైన బ్లష్‌ని ఇస్తుంది. అంతేకాకుండా, మీ చర్మానికి ఎక్కువ ఆక్సిజన్ వెళ్లడంతో, అది తక్షణమే మెరుస్తుంది. కాబట్టి అందమైన ముఖవర్ఛస్సుకు శృంగారం మంచిదని డాక్టర్ దివ్య వివరించారు.

శృంగారం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు

ముఖంలో సహజమైన కాంతితో పాటు, శృంగారం మరిన్ని విధాల ప్రయోజనాలను కలిగి ఉంది. అవేంటో ఈ కింద తెలుసుకోండి.

జుట్టు పెరిగేలా చేస్తుంది: మీ చర్మ ఆరోగ్యంతో పాటు, ఈస్ట్రోజెన్ రష్ మీ జుట్టును పెరుగుదలకు తోడ్పడుతుంది. మెరిసే కురులను మీ సొంతం చేసుకోవచ్చు. చాలా మంది గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ సెక్స్ నుండి ప్రయోజనం పొందారు. మందమైన ఒత్తైన జుట్టును పొందారు.

మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది: నగ్న శరీరాలు పెనవేసుకోవడం వలన ఆనందం కలుగుతుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. సెక్స్‌ను ఆస్వాదించడాన్ని సులభతరం చేస్తుంది. మీ శరీరంతో మీరు గడపడానికి, మీ స్వీయ సంరక్షణకు ఈ సమయం ఉపయోగపడుతుంది.