తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation | బంగారు భవిష్యత్తు కావాలంటే.. గతం గతః అనుకోవాల్సిందే..

Saturday Motivation | బంగారు భవిష్యత్తు కావాలంటే.. గతం గతః అనుకోవాల్సిందే..

HT Telugu Desk HT Telugu

07 May 2022, 8:24 IST

    • జరిగిపోయినదానిని మార్చలేము. కానీ జరగబోయే దానిని మార్చేందుకు ప్రయత్నించవచ్చు. జరిగిన తప్పును తలచుకుని కృంగిపోవడం కాదు.. మరోసారి ఆ తప్పు జరగకుండా చూసి మళ్లీ ప్రయత్నించవచ్చు. గతంలో ఆగిపోకుండా.. భవిష్యత్తు కోసం ముందుకు సాగిపోవచ్చు.
గతం గతః
గతం గతః

గతం గతః

Saturday Vibes | మనలో చాలా మందికి చీకటి గతాలు ఉంటాయి. వారిలో కొందరు గతంలోనే ఆగిపోతూ, కృంగిపోతూ.. అణగారిన, నిరాశాజనకమైన జీవితాన్ని గడుపుతారు. ఇది చాలా తప్పు. గతం మసకబారడానికి సమయం పడుతుంది. కానీ గతాన్నే తలచుకుని భవిష్యుత్తును పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. గతాన్ని మరచిపోకూడదు. కానీ దానితోనే ఆగిపోకూడదు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని.. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అసలైన గెలుపు. గతానికి, వర్తమానానికి సంబంధం లేదనే చెప్పలేము. ఎందుకంటే.. గతమన్నది ఎప్పుడూ వర్తమానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల మీరు ప్రస్తుత సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమ ఎంపిక.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

మీరు మీ వర్తమానాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు. మీ భవిష్యత్తును కచ్చితంగా రూపొందించుకోగలరు. కాబట్టి గతాన్ని విడిచి.. వర్తమానంపై శక్తి పెట్టాల్సిన సమయం ఇది. మీరు మీ వర్తమానాన్ని మార్చగలిగితే.. మీ భవిష్యత్తు మీ ప్రాధాన్యత ప్రకారం ఉంటుంది. మీ గతం మీ నియంత్రణలోనే ఉంటుందనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. అంతేకాకుండా మీ గతం చేసినా గాయాలను మరిచి.. మీ వర్తమానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి.

టాపిక్