తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Career Horoscope | ఆ రాశుల వారికి పనుల్లో ఆటంకాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూడండి

Career Horoscope | ఆ రాశుల వారికి పనుల్లో ఆటంకాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందో చూడండి

HT Telugu Desk HT Telugu

25 April 2022, 7:41 IST

google News
    • Horoscope Today | సోమవారం, 25 ఏప్రిల్ 2022న ఏ రాశివారికి ఎలా ఉంది? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నీరజ్ ధాన్ఖేర్ చంద్రమానం అనుసారంగా అందించిన రాశిఫలాలు
Horoscope Today
Horoscope Today (Unsplash)

Horoscope Today

మేషం:

ఈ రోజంతా మీరు మీకోసం కేటాయించుకోండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధచూపండి. మీ మనస్సుకు ప్రశాంతత కల్పించండి. మీరు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగినవారు. మీకు పనిభారం పెరగవచ్చు. అయితే ఈరోజు ఎలాంటి అదనపు పనిని స్వీకరించకండి. మీకు ఉన్న సమయాన్ని పూర్తిగా మీకోసమే వినియోగించుకోండి. మీ మనస్సును ఎగరనివ్వండి, ఈరోజు మీరు కొన్ని అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తారు.

వృషభం:

మీ సహోద్యోగులపై నెగెటివ్ ఆలోచనలు చేయకండి. ఎవరైనా ఎక్కువ పనులు చేసేందుకు ఉత్సాహంగా ఉంటే వారి స్వార్థం కోసం చేస్తున్నారంటూ వక్రీకరించవద్దు. ఆబ్జెక్టివ్ మైండ్‌తో ఆలోచించండి. తప్పుడు ఆలోచనల బారిన పడకండి. మీ సీనియర్‌లతో స్పష్టంగా ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయండి. ఊహాజనితంగా మాట్లాడకుండా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి.

మిథునం: 

మీ వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది. మీ ప్రేమ జీవితంపై ఉన్న ఆందోళన మీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మీలో మీరే తక్కువగా ఫీల్ అవుతారు. మీపై మీకే జాలికలగవచ్చు. అయితే మనసు భారం కాకుండా పనిపైనే దృష్టి సారించండి, సహోద్యోగులతో ఉల్లాసంగా గడపండి. కొన్ని విషయాలు వాటంతటవే సద్దుమణుగుతాయి.

కర్కాటకం: 

మీరు గత రెండు రోజులుగా ఒక విషయంపై నిరంతరాయమైన ఆలోచనలు చేస్తూ ఉండవచ్చు. ఇతరులకు సంఆవేశంగా ఉండకండి, కాస్త నెమ్మదించండి. ఇతరుల ఎజెండాతో మీకున్న అవకాశాలు కోల్పోవచ్చు. కాబట్టి మీ ఉత్సాహాన్ని కోపంగా మార్చడానికి బదులుగా, వైవిధ్యం కోసం దానిని మీ పనిపై చూపండి. త్వరలో ఫలితాలు మీకు అనుకూలంగా రావడం మీరు చూస్తారు.

సింహం: 

ఈరోజు మీపై ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీ సహచరులే మిమ్మల్ని క్రిందికి లాగడానికి మీ వెనుక గోతులు తొవ్వొచ్చు. మీరు మాత్రం మీ పనిపై దృష్టిపెట్టండి. నోటితో కాకుండా మీ పనితో సవాళ్లకు బదులు చెప్పండి. మీ ప్రయత్నాలకు గుర్తింపు ఉంటుంది. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య:

 మీ సమస్యలపై కాలయాపన చేయడానికి బదులుగా వాటిని బహిరంగంగా, నిజాయితీగా తెలియజేయడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు పనిచేసే చోట ఊహించని సంఘటనలు జరగవచ్చు. మీ సహోద్యోగితో కూడా వాగ్వాదానికి దిగవచ్చు. అయితే, మీదే పైచేయిగా ఉండవచ్చు. అయినప్పటికీ చివరి పంచ్ మీదే కావాలి అనుకోకుండా వివాదం ముదరకుండా ముగించే ప్రయత్నం చేయండి.

తుల: 

తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ లక్ష్యాలపై దృష్టిపెట్టండి, ఈరోజు అందుకు కొంత సమయం కేటాయించండి. మీ దీర్ఘకాలపు కెరీర్ లక్ష్యాలు ఏంటో గ్రహించండి. వృత్తిరంగంలో మీ అనుభవం మీకు మంచి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. మీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయండి.

వృశ్చికం:

మీ సృజనాత్మకత, మీకున్న బిజినెస్ మైండ్ ను ఉపయోగించి ఏదైనా కొత్తగా, ఆసక్తిని రేకిత్తించేది ప్రారంభించడానికి ఇది సరైనసమయం. మీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. మీ ఆలోచనలకు, పనులకు ఈరోజు బీజం పడితే అది కాలక్రమేణా స్థిరమైన అభివృద్ధిని పొందుతుంది. ఒకసారి కదలిక ప్రారంభమైతే ఆగడం అంటూ ఉండదు.

ధనుస్సు:

మీకు ఈరోజు అంతా అనుకూలంగా ఉంది. సానుకూల ఫలితాలు మీ కళ్ల ముందు కనిపిస్తున్నందున మీలో కొత్త ఆలోచనలు కలుగవచ్చు.మీ కెరీర్ విషయంలో మీ ఆకాంక్షలకు తగినట్లుగా కొత్త మార్గాలు మీ ముందు కనిపించే అవకాశం ఉంది. మీపై ఇతరుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఉంటే మీరు కొత్త మార్గంలో పయనించవచ్చు. అవసరమైతే ఇతరుల సలహాలు, సహాయాన్ని తీసుకోండి.

మకరం: 

మీ వృత్తి గురించి మీకు మరింత అవగాహన వచ్చేలా మీ సహోద్యోగులతో సన్నిహితంగా ఉండండి. మీరు పనిచేసే చోట చురుగ్గా ఉండండి, అందరితో హుషారుగా సంభాషణలు కొనసాగించండి. ఆఫీసులో మీ స్థానం సుస్థిరం చేసుకునే లక్ష్యంతో ముందుకుసాగండి. జ్ఞానాన్ని పెంచుకోవడం, మీకున్న నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం ద్వారా మీకు మంచి గుర్తింపు వస్తుంది.

కుంభం: 

ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ఉద్యోగంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించండి. కష్టమైన టాస్క్ లను మీ తెలివి, శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పూర్తిచేయండి. ఏదైనా ముఖ్యమైన టాస్క్ ఉంటే మొదటి ప్రాధాన్యత దానికి ఇచ్చి ఏకాగ్రతతో చేయండి. మీ ప్రయత్నాలకు ఇప్పటికిప్పుడే ఎలాంటి ప్రశంసలు దక్కకపోయినా, భవిష్యత్తులో మిమ్మల్ని మంచి స్థానంలో ఉంచుతాయి.

మీనం:

మీరు ఎలాంటి పనులైనా పూర్తి చేయగల సమర్థులు అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీరు పనిచేసే చోట వివిధ రకాల పనులను మీకే అప్పజెప్పే అవకాశం ఉంది. అయితే కొద్దిగా ఓపికగా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. రకరకాల ఆలోచనలు చేయకండి. నిర్మలంగా ఉంటే ఆచరణీయమైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. సహాయం కోరిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇతరుల మ్యానిప్యులేషన్ మీపై ఉండకుండా చూసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం