తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weekly Horoscope | రాశి ఫలాలు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30, ఆ రాశివారికి అదృష్టం!

Weekly Horoscope | రాశి ఫలాలు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30, ఆ రాశివారికి అదృష్టం!

HT Telugu Desk HT Telugu

24 April 2022, 8:39 IST

google News
    • Weekly Tarot Card Readings: ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ టారో కార్డ్ అనలిస్ట్ మనీషా కౌషిక్ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి. 
Read on to find out your Tarot reading for the coming week.
Read on to find out your Tarot reading for the coming week. (Unsplash)

Read on to find out your Tarot reading for the coming week.

పుట్టిన తేదీ ఆధారంగా ఈ వారం (ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30, 2022) రాశి ఫలాలు

మేష రాశి (మార్చి 21-ఏప్రిల్ 20)

సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికంగా ఉండవచ్చు. మీరు చేసే కఠోర శ్రమ, మీ అంకితభావం మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. మీ భాగస్వామి మీకు అన్ని విధాల సహకరిస్తుంది. మీ మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. స్థిరాస్తులు, పెట్టుబడులు కలిసివస్తాయి. మీ ప్రియమైన వారితో సరిన మాటలు లేకపోతే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. నూనె అధికంగా ఉండే వంటకాలను వదిలివేయాలి. మీ ఆరోగ్యం కోసం ఫైబర్ అధికంగా శాఖాహార ఆహారాన్ని ఎంచుకోండి. ఇల్లు లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు గురించి ఆలోచనలు చేయవచ్చు. ఈ విషయమై ముందుగా మీ కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

వృషభం (ఏప్రిల్ 21-మే 20)

మీ ధృడ సంకల్పం, తెలివితేటలతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా ఈ వారమంతా మీకు సానుకూలంగా ఉంది. అనుకున్న సమయం కంటే ముందుగానే మీరు మీ టార్గెట్స్ పూర్తిచేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఒత్తిడి, కండరాల నొప్పులు ఉంటే ధ్యానం లాంటి రిలాక్సేషన్ పద్ధతులు ఉపయోగపడతాయి. మీ ప్రేమ వ్యవహారాలను అనుకూల సమయం వచ్చేంతవరకు గోప్యంగానే ఉంచడం మంచిది.చాలాకాలం తర్వాత ఆశ్చర్యకరంగా గెట్- టుగెదర్ జరగవచ్చు, ఇది ఈ వారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథున రాశి (మే 21-జూన్ 21)

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరింత ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. మీరు పడిన శ్రమకు నగదు ప్రయోజనం లేదా మంచి గుర్తింపు దక్కవచ్చు. కొన్ని అంచనాలతో చేసే పెట్టుబడులు స్వల్ప లాభాలను తెచ్చిపెట్టవచ్చు, మీ ప్రణాళికలను అమలుపరచండి.ఆరోగ్యంపై శ్రద్ధపెట్టండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే సరైన పోషకాహారం తీసుకోండి, ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకోండి. గృహంలో ఈవారం ఏవైనా వేడుకలు జరిగే అవకాశం ఉంది. మీ ఆత్మీయులతో అనందక్షణాలను అనుభవించవచ్చు. మీ భాగస్వామితో బంధం మరింత మెరుగుపడుతుంది. శృంగార బంధం మధురానుభూతులతో సాగుతుంది. ఆస్తి పంపకాలు లాభాసాటిగా జరుగుతాయి.

కర్కాటక (జూన్22-జూలై 22)

అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. త్వరలో మీకు మంచి రోజులు రానున్నాయి. ఈ వారం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. వారితీ కలిసి విందులు, వినోదాలతో సరదాగా గడపవచ్చు. ఎంఎన్సీలలో పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రతిష్టాత్మకమైన విదేశీ అసైన్‌మెంట్లలో పని చేసే అవకాశాలను అందుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేయండి. వారు మీ నుంచి మరికొంత శ్రద్ధ కోరుకుంటున్నారు. మీ వద్ద ఉన్న మిగులు మూలధనాన్ని స్టాక్స్‌లో లేదా వాహనం కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు. మీ నిస్వార్థ వైఖరి ఇతరులతో వివిధ విషయాల్లో పరస్పర అవగాహనను మరింత మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని గత కొంతకాలంగా ఇబ్బందిపెడుతున్న ఓ అంశాన్ని వదిలించుకోవడం కోసం మరింత తీవ్రంగా ప్రయత్నించవలసి ఉంటుంది. చిన్నపిల్లలను తీసుకుని యాత్రలకు వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

సింహ రాశి (జూలై 23-ఆగస్టు 23)

జీవితంలో మీ ఎదుగుదల కోసం, మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు మీ అన్వేషణ సాగుతుంది. ఇందుకోసం రెట్టింపు ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ లక్ష్యాలను సాధించే వరకు ఆగిపోకూడదు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది మీకు ఉల్లాసాన్ని పంచుతుంది. శారీరక నొప్పులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టవచ్చు. సరైన విశ్రాంతి కోసం మీరు మీ పనుల నుంచి కొంత విరామం తీసుకోవాల్సి రావొచ్చు. మీ ఆదాయానికి, ఖర్చులకు సమతుల్యత లోపిస్తుంది. ఈ క్రమంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ ప్రణాళికలను మీ సహోద్యోగులతో గానీ, పరిచయస్తులతో గానీ పంచుకోకండి. మీరు మోసపోయే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. శృంరారాన్ని ఆస్వాదించండి.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)

మీ ధైర్య సాహసాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా అవిశ్రాంతంగా పనిచేయాల్సి రావచ్చు. మీ కెరీర్‌కు సంబంధించినంత వరకు ఈ వారం ఉత్సాహంగా కనిపిస్తుంది. మీకు కీలక బాధ్యతలు లభిస్తాయి. మీరు ఇష్టపడే వ్యక్తులతో మీ భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి వెనుకాడరు. వారి సంతోషం కోసం ఏమైనా చేయాలనుకుంటారు. శృంగారంతో మీ బంధం మరింత బలంగా మారుతుంది. కొందరికి ఆర్థిక సంక్షోభం ఉంటుంది, అదనపు ఆదాయ మార్గాల కోసం చూస్తారు. వారసత్వంగా సంక్రమించే ఆస్తుల విషయంలో అభిప్రాయభేదాలు చెలరేగే సూచనలు ఉన్నాయి. ప్రశాతంగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం శ్రేయస్కరం.

తులా రాశి (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీరు మీ ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తారు. ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే కొన్ని రిస్కులు తీసుకొని, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం. కొత్తవ్యక్తులతో సంబంధం కలుపుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారం మీ ఖర్చులు మీ బడ్జెట్‌ను మించే అవకాశం ఉంది. ఖర్చుచేసే విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిపరమైన విషయాల్లో క్లిష్ట పరిస్థితులుఎదుర్కొనవచ్చు. దేనికి కృంగిపోవద్దు. తీవ్రమైన నిర్ణయం తీసుకునే ముందు సంయమనం పాటించండి. మీ సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం, యోగా లాంటివి చేయడానికి ప్రయత్నించండి. 

వృశ్చిక రాశి (అక్టోబర్ 24-నవంబర్ 22)

పనుల్లో పురోగతి ఉండదు. వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. మందగమనాల వల్ల నిరుత్సాహపడకండి, 'స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్' సామెతను నమ్మండి. మీ కలలను నిజం చేసుకోవడానికి పట్టుదలతో ఉండండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. యోగాసనాలు ఆచరించండి ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తుంది. వృతిరంగంలో ఈ వారం మీకు అంతా సానుకూలంగా ఉంది. మీ పనికి సరైన గుర్తింపు దక్కుతుంది. మీ ఆర్థిక అవసరాలు తీరాలంటే ఉద్యోగం మాత్రమే కాకుండా రెండో ఆదాయ వనరు కోసం చూడండి. పొదుపు మంత్రాన్ని పాటించండి. మీ భాగస్వామి విషయంలో గతాన్ని త్రవ్వకండి, ఇది మీ మధ్య చీలికను తెస్తుంది. అర్థం చేసుకుని మెలిగితే మంచి సమయాన్ని గడపవచ్చు.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)

చాలాకాలంగా చేస్తున్న మీ ప్రయత్నాలకు ఈ వారం ఫలితం దక్కవచ్చు. దీనికోసం మీరు మీ పూర్తి సామర్థ్యాలను ఉపయోగించండి. మీ గతానుభవాలను నెమరువేసుకోండి. వాటి నుంచి కొత్తగా ఏం పాఠాలు నేర్చుకున్నారో తెలుసుకోండి. ఇది మీలో మార్పును తీసుకువస్తుంది. వృత్తిరంగంలో బాధ్యతలు పెరుగుతాయి, వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఇది భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ ప్రియమైన వారితో ఆనందక్షణాలను గడుపుతారు. మీ భాగస్వామితో నిజాయితీగా మీ భావాలను వ్యక్తపరచండి. పిల్లల విషయంలో ఆనందకరమైన విషయాన్ని అందుకుంటారు. కొత్త వ్యాపారంపై ఆలోచనలు చేయవచ్చు. వినూత్న మార్గాలతో ముందుకు రావచ్చు. ఇవి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. 

మకరం (డిసెంబర్ 22-జనవరి 21)

కొన్ని సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, మీ ప్రవర్తనలో గొప్ప సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఇది ప్రపంచాన్ని ఆశావహ దృక్పథంతో చూస్తారు. నూతన ఉద్యోగ వేటలో ఉన్నవారు అందమైన వేతనంతో ఆశించదగిన ఉద్యోగాన్ని పొందే సూచనలు ఉన్నాయి. గృహంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నట్లయితే వివాదాలను పెంచకుండా, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఆలోచనలు చేయండి. కచ్చితంగా ఆశించిన ఫలితాలు వస్తాయి. భాగస్వామితో గొడవలుపడే అవకాశం ఉంది, మీ మాటలను గమనించండి. అనవసరంగా నోరు జారకండి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లడం, పార్కుకు వెళ్లడం ద్వారా సానుకూల మార్పును పొందవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారరంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి, తద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

కుంభం (జనవరి 22-ఫిబ్రవరి 19)

నూతన విశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించే అవకాశాలు ఈ వారం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పర్చుకోండి, ఈ పరిచయాలు మీకు దీర్ఘకాలంలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మీకు శృంగార భాగస్వామి దొరికే అవకాశమూ లేకపోలేదు. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు బాధించే సూచనలు ఉన్నాయి. ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ సమస్యలను స్నేహితులతో పంచుకోండి, వారి సహాకారం తీసుకోండి. మీ మనసుకు నచ్చినట్లుగా పనులు చేయండి.  ఖర్చులు కాకుండా పొదుపుపై దృష్టిపెట్టండి, లేదంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంది.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

మీ లక్ష్యాలను సాధించడానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి. మిమ్మల్ని మీరు పునరుజ్జీవనం చేసుకోవడం కోసం పని నుంచి కాస్త విరామం తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంతో పనులు చేసేందుకు ముందడుగు వేస్తారు. మీ ఉత్సాహానికి ప్రశంసలు దక్కుతాయి. ఐటీ రంగంలో వారికి వృత్తిరీత్యా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, పనిభారం కూడా ఎక్కువ ఉండవచ్చు. కుటుంబంలో తలెత్తిన సమస్యలు పరిష్కారం అవుతాయి, అపార్థాలు సమసిపోవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం, ఎవరైనా తియ్యగా మాట్లాడి కాజేసే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినపుడు ఒకరిద్దరి సలహాలను స్వీకరించండి. భాగస్వామితో మనస్ఫర్థలు తలెత్తే అవకాశం ఉంది. బాధ్యతగా మెలగండి, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి.

 

టాపిక్

తదుపరి వ్యాసం