తెలుగు న్యూస్  /  Lifestyle  /  Saturday Motivation Focus On Progress Not The Pain

Saturday Motivation | ఎన్నికష్టాలు వచ్చినా.. ముందడుగేయండి.. గెలిచేయండి..

HT Telugu Desk HT Telugu

23 April 2022, 8:26 IST

    • ఏ ప్రయాణంలోనైనా ఒడిదొడుకులు తప్పనిసరి. సమస్యలు వచ్చాయి కదా అని వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేము. ఎందుకు ఆ సమస్యలు వచ్చాయి.. తర్వాత ఇలాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి ముందుకు వెళ్లినప్పుడే పురోగతి లభిస్తుంది.
పురోగతిపై దృష్టి పెట్టండి
పురోగతిపై దృష్టి పెట్టండి

పురోగతిపై దృష్టి పెట్టండి

Saturday Motivation | వెళ్లే దారిలో ఒక్కోసారి విజయం సాధించవచ్చు. మనకి అనుకూలించే అంశాలు ఎదురవ్వొచ్చు. లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టే లేదా బాధపట్టే అంశాలు ఎదురుకావొచ్చు. అయినా సరే ముందుకు సాగాలి. అదే జీవితం అంటే. ఎప్పుడు కూడా నొప్పి, బాధపై దృష్టి పెట్టవద్దు. లేదంటే మీకు పురోగతి ఉండదు. ఒక్కసారి సరే ఏం కాదు.. పర్లేదు అనుకుని ముందుకు వెళ్లండి మంచి ఫలితాలు లభిస్తాయి. 

చిన్నప్పుడు నడక నేర్చుకుంటూ ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం. నొప్పి గురించి ఆలోచిస్తే.. మళ్లీ లేచి నడిచేవాళ్లమా? పరిగెత్తే వాళ్లమా? బాధలు కూడా అలాంటివే.. వాటిని ఎంతవరకు తీసుకోవాలనే విషయం మనకి తెలిస్తే.. జీవితంలో ముందుకు వెళ్లడం అంత సులువు అవుతుంది.

ఏదైనా మొదటిసారిగా ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రారంభిస్తున్నప్పుడ సమస్యలు రావడమనేది చాలా కామన్. ఆ సమస్యలనుంచి మనం ఏదైనా నేర్చుకుని.. మూవ్​ ఆన్​ అయిపోవాలి. మన జీవితమున్నదే పాఠాలు నేర్చుకోవడానికే. ప్రతి రోజును మన కాస్త మెరుగుపరచుకుని ముందుకు సాగాలి అంతే.

టాపిక్