తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation | లైఫ్ కలర్​ఫుల్​గా ఉండాలంటే.. నిర్ణయాలు మీరే తీసుకోవాలి..

Tuesday Motivation | లైఫ్ కలర్​ఫుల్​గా ఉండాలంటే.. నిర్ణయాలు మీరే తీసుకోవాలి..

HT Telugu Desk HT Telugu

19 April 2022, 7:51 IST

    • కొందరు ఎలా ఉంటారంటే.. తమ జీవితానికి సంబంధించిన అన్ని రైట్స్​ను ఎవరో ఒకరికి అప్పజెప్పేస్తారు. కనీసం తమకు నచ్చినది కూడా చేయకుండా.. ఎదుటివారు ఏది చెప్తే అదే మంచిదని గుడ్డిగా నమ్మేస్తారు. మనపై మనకి మాత్రమే పూర్తి నియంత్రణ ఉండాలని.. దానిని వేరే వ్యక్తుల చేతిలో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు.
నీ జీవితానికి నువ్వే హీరో
నీ జీవితానికి నువ్వే హీరో

నీ జీవితానికి నువ్వే హీరో

Tuesday Motivation | ఎవరైనా సంతోషంగా ఉండాలంటే.. స్వీయ నిర్ణయమే ప్రధానం. నిర్ణయం తీసుకునే సమయంలో మన ఎంపికలు.. లేదా కొత్త విషయాలు అభివృద్ధి చెందే అవకాశముంది. మన తీసుకునే నిర్ణయాలకు వేరెవరివో ప్రణాళికలు అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకున్నా.. తుది నిర్ణయం మాత్రం మీదే అయ్యిండాలి. అంతే కానీ ఎవరో మీ జీవితాన్ని డిసైడ్​ చేసేస్తామంటే మాత్రం నో చెప్పేయండి. మీ జీవితానికి మీరే ఆర్టిస్టు. ఏ రంగులు వేసుకుంటారో.. లైఫ్​ని ఎంత కలర్​ ఫుల్​గా మార్చుకుంటారో మీ ఇష్టం. అంతేకానీ వేరొకరు మీ నిర్ణయాలు తీసుకుంటే.. మీ జీవితం అంతా ఒకటే రంగు ఉంటుంది.

తప్పులను సరిదిద్దుకుంటూ..

నీ జీవితానికి నువ్వే కళాకారుడివి. నీ కాన్వస్​పై ఏ రంగులు వేస్తావో కూడా నీ ఇష్టమే. అంటే మనం తీసుకునే నిర్ణయాలకు పూర్తి బాధ్యత మనదే. మన చిత్రం ఎంత అందంగా రావాలనుకుంటే.. దానిని అంత శ్రద్ధతో వేస్తాం. జీవితం కూడా ఎంత చక్కగా ఉండాలంటే.. అందుకోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కోసారి తప్పులు కూడా చేస్తాం. కానీ మన తప్పు మనకు తెలిసినప్పుడు.. మళ్లీ దానిని రిపీట్ చేయము. కాబట్టి తప్పు జరిగినప్పుడు మంచి అనుభవం వచ్చిందనుకోవాలి. అంతేకాని మన పెయింటింగ్​ను ఎవరి చేతిలోనే పెట్టేసి.. వారు ఇష్టమొచ్చినట్లు దానిని వేస్తుంటే.. చూస్తూ కుర్చోవడం మంచిది కాదు. ఇప్పటివరకు ఎలా సాగినా.. ఇకనైనా మీ పెయింటింగ్ మీరే వేసుకోండి. అందమైన రంగులతో.. జీవితాన్ని తీర్చిదిద్దుకోండి.

టాపిక్