తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Career Horoscope | ఈరోజు ఆ రాశి వారు పనిచేసే చోట మరింత అప్రమత్తంగా ఉండాలి!

Career Horoscope | ఈరోజు ఆ రాశి వారు పనిచేసే చోట మరింత అప్రమత్తంగా ఉండాలి!

HT Telugu Desk HT Telugu

18 April 2022, 7:50 IST

    • ఈరోజు 18, 2022న వివిధ రాశుల వారికి వృత్తిపరంగా ఎలా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నీరజ్ ధాన్ఖేర్ చంద్రమానంను అనుసరించి అందించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి..
Horoscope Today
Horoscope Today (Unsplash)

Horoscope Today

మేషరాశి :

మీపై మీకు ధీమా పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు. ఓర్పు, సహనంతో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయండి. మీరు పనిచేసే చోట కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం కన్నా, కొన్నిసార్లు మౌనంగా ఉండటం మేలు. మీరు సమస్య పరిష్కారానికి మీ వంతు ప్రయత్నం చేసినా, ఎదుటివారు దానిని మరోలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

వృషభం: 

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. మీ శక్తి, సామర్థ్యాలతో అన్నీ మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీ ప్రయత్నాలు, మీ నిబద్ధత చూసి ఇతరులు ఆకర్షితులవుతారు. పనిచేసేచోట కీలకంగా వ్యవహరిస్తారు, దీంతో మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఒక స్పష్టమైన అవగాహనతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. మీరు అనుసరించే శైలి, సహోద్వ్యోగులతో మీరు మెలిగే తీరు మీకు మంచి గుర్తింపును తెస్తాయి.

మిథునం : 

ఇతరులపై వేలెత్తి చూపేముందు, మీ వైపు నుంచి అంతా సరిగ్గా ఉందా అనేది చూసుకోండి. మీరు అంతర్లీనంగా ఆందోళన చెందే పరిస్థితులు తలెత్తవచ్చు. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం కూడా కొన్నిసార్లు సరైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి మీరు అందరిలా కాకుండా మీకంటూ ఉన్న సొంత వివేకం, విచక్షణతో మెలగాలి. ఏ విషయంలోనైనా భయపడకుండా ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ ఆలోచనలు, మీ ఉత్సాహం మిమ్మల్ని ఉన్నతంగా ఎదిగేలా చేస్తాయి.

కర్కాటకం: 

మీకు ఉన్నటువంటి విద్యానేపథ్యం, మీరు అనుభవంతో నేర్చుకున్న జ్ఞానం మీ సహోద్యోగులకు లేదనే వాస్తవాన్ని గుర్తించండి. అయితే ఇందుకోసం మీరు పోటీలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు.  వృత్తి రంగంలో మీరు చేసే ప్రయత్నాలకు ఎవరైనా ప్రశంసించాల్సిందే. మీ వద్ద ఉన్న నైపుణ్యాలు, మీ ఆలోచనలే మీకు అత్యంత విలువైన ఆస్తులు. మీ అమూల్యమైన జ్ఞాన సంపదను ఇతరులు గుర్తించాల్సి ఉంది. మీపై మీరు నమ్మకం ఉంచి ముందుకు సాగండి.

సింహం: 

మీరు చేస్తున్న ప్రయత్నాలకు మరికొంత ఊతం ఇస్తే అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. మీరు చేపట్టే కొత్త కార్యక్రమాలకు సహోద్యోగుల మద్ధతు ఉండకపోవచ్చు, వారే అడ్డుకట్ట వేయవచ్చు. అయితే వారితో అనవసరపు వాదనలు చేయకుండా, సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని కనుగొనండి. మీరు సహనంతో వ్యవహరిస్తూనే పట్టుదల చూపించాలి. అప్పుడే మీ ప్రయత్నాలు ఇతరులు అర్థం చేసుకునే వీలుంది.

కన్య:

 ఈరోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. గొప్పలకు పోకుండా సాధ్యమైనంతవరకు తక్కువలో ఉండండి. మీ చర్యలతో సహోద్యోగులు అలాగే మీ పై అధికారులు కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నోరకాల ఆలోచనలు వస్తాయి, మీరు కుదురుగా ఉండలేరు. తదుపరి ఏం చేయాలనే స్పష్టత మీలో లోపిస్తుంది. ఈరోజు మీది కాదు అనుకొని కొన్ని విషయాలను వదిలేయడమే మంచిది. పడటం అనేది ఓడటం కాదు, ఈరోజు ఒక మెట్టు కిందకు దిగడం చేస్తే రేపు ఇంకాస్త ఎదుగుతారు అనేది గుర్తుంచుకోండి.

తుల: 

ఈరోజు మీకు అనుకూలంగా మారాలంటే త్వరితగతిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కార్యాచరణలో వేగం ఉండాలి. చాకచక్యంగా వ్యవహరించి సహోద్యోగుల మద్ధతు పొందగలిగితే మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ దీర్ఘకాలిక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరితో స్నేహభావంతో మెలగాలి. లక్ష్యం దిశగా పట్టుదల చూపాలి. ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి.

వృశ్చికం: 

పనిచేసే చోట అడ్డంకులు అధిగమించలేనంత కష్టంగా ఉంటే, ఒకేరకమైన ఆలోచనలతో ఉండకుండా కొత్త మార్గాలను అన్వేషించండి. చిన్నచిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేయండి. విజయం సాధించాలంటే కొన్ని ఆటుపోట్లు తప్పవు. మీ విషయంలో మీకు ఉన్న ఒక గొప్ప అనుకూలత ఏమిటంటే అది మీ ఆత్మవిశ్వాసం. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా పట్టుదలతో ముందడుగు వేయండి. కొన్నిసార్లు జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు కూడా విలువైన పాఠాలను నేర్పుతాయని గుర్తుంచుకోండి.

ధనుస్సు: 

ఈరోజు మీరు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మీరు పనిచేసే చోట మీ సహచరుల్లో కొంతమంది మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఉంది. మీపై అనవసరంగా చర్యలు తీసుకునేలా ప్రేరేపించవచ్చు. మీరొక విషపూరిత వాతావరణంలో పనిచేస్తున్న అనుభూతి కలగవచ్చు. మీకు సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నట్లు తెలుసుకుంటే వాటిని మీ సూపర్‌వైజర్‌కు తెలియజేయండి. ప్రశాంతంగా సమస్య పరిష్కారానికి మీవంతు ప్రయత్నం చేయండి.

మకరం: 

మీరు చేసే ఉద్యోగం విషయంలో ఆశాజనకంగా ఆలోచించండి. మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు మీ వృత్తి జీవితాన్ని మరింత స్థిరంగా, భద్రంగా మార్చుతాయి. వృత్తిపరంగా మంచి గుర్తింపును, మరింత అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా మీ ప్రణాళికలను అమలు చేయండి. మీ నమ్మకం, మీ శక్తి సామర్థ్యాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

కుంభం: 

కొత్త అవకాశాలు మీ తలుపుతట్టే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీరు ఎంచుకున్న లక్ష్యాలు మిమల్ని వేరొక మార్గంలో ప్రయాణించేందుకు ప్రేరేపించవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, కొత్త పరిచయాలు పెంచుకోవడానికి, మీ పరిధిని విస్తరించుకోవడానికి ఈరోజు మీకు అంతా అనుకూలంగా ఉంది. ఏదైనా మార్పు కోరుకుంటే మీరు మీ సీనియర్ల సహాయం కోరడం తెలివైన చర్య.

మీనం: 

వృత్తిరంగంలో మీ భవిష్యత్తు గురించి మీరు కొంచెం ఆందోళనగా ఉండవచ్చు. బహుశా మీరు మరోవైపు వెళ్లేందుకు ఆసక్తి చూపవచ్చు. మీరు మీ వృత్తి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి, జీవితంలో ఏదైనా కొత్త మార్పు రావాలని కోరుకోవచ్చు. అయినప్పటికీ మీ ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. కొన్ని విషయాల్లో అంతా అస్పష్టంగా అనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పున: పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని ఏది వెనక్కి నెడుతుందో గుర్తించాల్సిన సమయం ఇది.

టాపిక్

తదుపరి వ్యాసం