తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation | మనిషన్నాక కాస్తంత కాదు.. కాస్త ఎక్కువే దయ ఉండాల..

Saturday Motivation | మనిషన్నాక కాస్తంత కాదు.. కాస్త ఎక్కువే దయ ఉండాల..

HT Telugu Desk HT Telugu

30 April 2022, 9:37 IST

    • మనుషులకు ఉండే గొప్ప లక్షణాలలో దయ ఒకటి. దయ లేకపోతే వారు మనిషిగా పరిగణించబడరు. మనలో దయ లేకపోతే మానవత్వం ఎప్పుడో చనిపోయేది. కాస్తో కూస్తో అందరిలోనూ దయ ఉంటుంది కాబట్టే కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నాం. కాబట్టి మీకు దయ, జాలి ఉన్నందుకు ఎప్పుడు బాధపడకండి.
దయ
దయ

దయ

Saturday Motivation | దయ అనేది వ్యక్తిత్వ లక్షణం. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇతరులకు సహాయం చేయడానికి, క్షమించడానికి, సానుభూతి చూపడానికి, నిస్వార్థంగా ఉండకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఇది ప్రభావవంతమైన వ్యక్తీకరణలలో ఒకటి. దయలో ఎప్పుడు స్వార్థం, మూర్ఖత్వం ఉండదు. కేవలం త్యాగం మాత్రమే ఉంటుంది. మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారికి ఇది ఒక సాధారణ విషయం. వారు తమ జీవితాంతం దయకు మద్దతు ఇచ్చారు.

మనం కూడా ఇతరులతో దయగా ఉండడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులకు.. వీలైనంత సహాయం చేస్తుండండి. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో దయగా ఉంటే.. మీరు అడగకుండానే దానిని తిరిగి పొందుతారు. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గౌరవిస్తూ.. వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు వారు కచ్చితంగా తిరిగి వస్తారు. ఏదో ఆశించి మాత్రం సహాయం చేయకండి. ఎప్పుడు దయను కలిగి ఉండండి. మీ నిర్ణయానికి ఎప్పటికీ మీరు చింతించరు.

టాపిక్

తదుపరి వ్యాసం