తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lucky Plants: మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలివే..

lucky plants: మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలివే..

27 April 2023, 13:46 IST

  • lucky plants: ఉద్యోగం రాకపోవడం, పెళ్లి అవ్వక పోవడం, డబ్బు సమస్యలు.. ఇలా చాలా విషయాల్లో అదృష్టం కలిసి రాకే ఈ సమస్యలు అనిపిస్తుంది.  అయితే  కొన్ని మొక్కలు మీ అదృష్టాన్ని పెంచి మంచి చేస్తాయని నమ్ముతారు. 

లక్కీ బ్యాంబూ
లక్కీ బ్యాంబూ (pexels)

లక్కీ బ్యాంబూ

మొక్కలు ఇంటికి అందంతో పాటూ అదృష్టాన్నీ తీసుకొస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలను అదృష్ట సూచకంగా భావిస్తారు. వాటివల్ల మనసుకీ, మనకీ మంచి జరుగుతుందని నమ్మకం. అలాంటి మొక్కలు మనింట్లో కూడా ఉంటే మనకూ అదృష్టం కలిసొస్తుందేమో. ఇంతకీ ఆ మొక్కలేంటో చూద్దామా..

ట్రెండింగ్ వార్తలు

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

లక్కీ బ్యాంబూ (lucky bamboo):

పేరులో బ్యాంబూ.. వెదురు అని ఉన్నా ఇది నిజమైన వెదురు మొక్క కాదు. వెదురు లాగా పొడవుగా ఉంటుంది. ఇది ఇంట్లో, నీళ్లలోనే మట్టి అవసరం లేకుండా పెరుగుతుంది. నేరుగా వచ్చే ఎండలో కాకుండా కాస్త తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో పెడితే ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో తూర్పు దిక్కులో దీన్ని పెట్టడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందనీ, ఆగ్నేయంలో పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ (snake plant):

పేరులో పాము ఉంది కదాని ఈ మొక్క చెడు చేయదండీ.. చూడటానికి పాము లాగా దీని ఆకులు మెలితిరిగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందేమో. ఈ మొక్కలు ఆఫీసుల్లో, ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెబుతారు. ఇది గాలిలో ఉండే విషపు వాయువుల్ని పీల్చుకుని గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఈ మొక్క సులువుగా పెరుగుతుంది కూడా.

తులసి (basil):

ఔషద గుణాలతో పాటే అదృష్టానికి కూడా తులసి మొక్క సూచిక. ఆయుర్వేదంలో తులసి ఆకులను చాలా రోగాలకు మందుగా వాడతారు. ఆ ఆకులని తింటే ఆరోగ్యంతో పాటూ ప్రశాంతత దొరుకుందని చెబుతారు. ఈ మొక్క ముందు కూర్చుని ధ్యానం చేస్తే మనసులో సానుకూల ఆలోచనలు మెదులుతాయని నమ్మకం. దాంతో పాటే ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల్ని పాలద్రోలుతుంది, బ్యాక్టీరియాను చంపుతుంది, పాజిటివిటీనీ నింపుతుంది.

రబ్బర్ ప్లాంట్

రబ్బర్ ప్లాంట్ (rubber plant):

ఈ మొక్కను ధనానికి, అదృష్టానికి సూచికగా భావిస్తారు. ఇంటి లోపల పెంచుకోడానికి ఇది అనువైన మొక్క. గాలిని శుద్ధి చేయడంతో పాటూ శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా చేసే గుణం ఈ మొక్కకుంది. ఈ మొక్కను సహజ సిద్ధ ఎయిర్ ప్యూరిఫయర్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి లోటుండదని నమ్మిక.