తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

Haritha Chappa HT Telugu

07 May 2024, 14:00 IST

    • River Rafting: రివర్ రాఫ్టింగ్ యువతకు నచ్చే ఒక జలక్రీడ. ఇది ఎక్కడపడితే అక్కడ ఉండదు. భారతదేశంలోని కొన్ని నదీ ప్రాంతాలు రివర్ రాఫ్టింగ్‌కు ఉత్తమమైనవి.అవేంటో తెలుసుకోండి
కాళీ నదిలో రివర్ రాఫ్టింగ్
కాళీ నదిలో రివర్ రాఫ్టింగ్ (Pixabay)

కాళీ నదిలో రివర్ రాఫ్టింగ్

River Rafting: భారతదేశంలో ఎన్నో అందమైన నదులు ఉన్నాయి.వేసవిలో నదీ ప్రాంతాల్లో రివర్ రాఫ్టింగ్ చేయాలని ఎంతో మంది యువత కోరుకుంటుంది.అలాంటి యువతకు మన భారతదేశంలోని ఎన్నో నదీ ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి.మెలికలు తిరుగుతూ సాగిన నదులలో రాఫ్టింగ్ సాహసోపేతంగా ఉంటుంది. అలాంటి నదీ ప్రాంతాల జాబితా ఇచ్చాము.

రిషికేష్

ఉత్తరాఖండ్లో ఉండే రిషికేశ్ ప్రాంతాన్ని ప్రపంచ యోగా రాజధానిగా చెప్పుకుంటారు. గంగానది... రిషికేశ్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. శివపురి నుండి రిషికేశ్ వరకు 16 కిలోమీటర్ల వరకు రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు.

జంస్కర్ నది

ఈ నది లడక్ ప్రాంతంలో ఉంది. మన దేశంలో రివర్ రాఫ్టింగ్ అనుభవం కావాలంటే జంస్కర నదికి వెళ్ళండి. పాదుమ్ ప్రాంతం నుండి నిమ్మో వరకు రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. ఇంకా అనేక సాహస క్రీడలు కూడా ఇక్కడ ఉన్నాయి.

బియాస్ నది

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్ చేయాలంటే చాలా సాహసం అనే చెప్పాలి. కులూ లోయ నుండి ప్రవహించే బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువే. పిర్డి ప్రాంతం నుంచి నుండి జిరి ప్రాంతం మధ్య ఈ రివర్ రాఫ్టింగ్ ఎక్కువగా చేస్తారు. దట్టమైన అడవులు, క్రిస్టల్ క్లియర్‌గా కనిపించే నీళ్లు రివర్ రాఫ్టింగ్‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది.

సియాంగ్ నది

అరుణాచల్ ప్రదేశ్లోని ఉంది ఈ సియాంగ్ నది. ఇది గిరిజన గ్రామాల వెంబడి సాగుతుంది. అక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తే ఒక ఉల్లాసమైన అనుభవం మిగులుతుంది. ఎన్నో గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదలను కూడా చూడవచ్చు.

తీస్తా నది

సిక్కింలో అందంగా ప్రవహించే నది తీస్తా. హిమాలయాల నుండి జనించిన ఈ నది ఎన్నో ప్రకృతి అందాల మధ్య పారుతూ ఉంటుంది. ఇక్కడ చేసే రివర్ రాఫ్టింగ్ సాహసోపేతంగా సాగుతుంది. చుట్టుపక్కల సహజ సౌందర్యాలతో పచ్చని చెట్లు మెరిసిపోతూ ఉంటాయి. వాటి మధ్య చేసే రివర్ రాఫ్టింగ్ అద్భుతమైన అనుభూతిని మిగిలేస్తుంది.

కాళీ నది

కర్ణాటకలోని దట్టమైన అడవుల్లో మధ్య సాగే నది కాళీ. పచ్చదనం, జలపాతం రెండూ కలిపి చూడాలనుకుంటే ఈ కాళీ నది దగ్గరకు వెళ్ళండి. ఇక్కడ చేసే రివర్ రాఫ్టింగ్ మీకు మంచి అనుభవాన్ని మిగిలిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం