Budget Friendly Trip : రిషికేశ్‌కి వెళ్తే.. ఆ ఆశ్రమాల్లో ఫ్రీగా ఉండొచ్చు..
Weekend Getaway Trips : శీతాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ఏదైనా ట్రిప్‌కి వెళ్లాలి.. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ వింటర్‌కి, బడ్జెట్‌కి సరైన ప్లేస్ ఒకటి ఉంది. అదే రిషికేశ్. ఇది ఎందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Weekend Getaway Trips : వారాంతపు విహారయాత్రలకు అందరూ వెళ్లాలి అనుకుంటాము. అయితే ఒక్కోసారి బడ్జెట్ తగినంత లేదని ఆగిపోతూ ఉంటాము. కానీ మీకు మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చే.. తక్కువ బడ్జెట్ గల ట్రిప్‌కి వెళ్లాలి అనుకుంటే రిషికేశ్ వెళ్లిపోండి. ఇది ఇండియాలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది గంగా నది పక్కన.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంది.
వీకెండ్లో మంచి ట్రిప్‌కి వెళ్లాలి అనుకునేవారికి రిషికేశ్ మంచి ఎంపిక. ఎందుకంటే.. ఇక్కడ మీకు పలు ఆశ్రమాలు మీకు ఉచిత బస సౌకర్యాలను అందిస్తాయి. దీనివల్ల మీకు బడ్జెట్ కలిసి వస్తుంది. కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఈ వింటర్లో మీరు మంచి ట్రిప్‌కి వెళ్లాలి అనుకుంటే.. రిషికేశ్ బెస్ట్ ఆప్షన్. ఇంతకీ ఉచితంగా స్టేయింగ్‌ను అందించే ఆశ్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరమార్థ నికేతన్ ఆశ్రమం
ఈ ఆశ్రమం వాలంటీర్లకు ఉచిత వసతి, భోజన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఆశ్రమంలో ఉండాలనుకునే వారు.. అక్కడ కొన్ని పనులు చేయడానికి సహాయం అందించాలి. పరమార్థ నికేతన్ ఆశ్రమం ప్రసిద్ధ రామ్ ఝూలా సమీపంలో ఉంది.
భారత్ హెరిటేజ్ సర్వీసెస్
మీరు హెరిటేజ్ సర్వీసెస్‌లో స్వచ్ఛందంగా సేవలందించవచ్చు. అంతేకాకుండా ఉచిత బసను పొందవచ్చు. ఇదో యోగా స్కూల్. ఈ ప్రదేశం యోగా, ధ్యానం కోసం ఉచిత శిక్షణను అందిస్తుంది. ఈ ఆశ్రమం రిషికేశ్‌లోని గంగా విహార్ కాలనీలో ఉంది.
గీతా భవన్ ఆశ్రమం
గీతా భవన్ రిషికేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ ఆశ్రమాలలో ఒకటి. ఇది వాలంటీర్లకు ఉచిత భోజనం, వసతిని అందిస్తుంది. ఈ ఆశ్రమంలో 1000 గదులు ఉన్నాయి. ఇది రిషికేశ్‌లోని స్వర్గాశ్రమ రహదారిలో ఉంది.
పైన పేర్కొన్నవే కాకుండా.. స్వచ్ఛంద సేవలును అందించే వ్యక్తులకు ఉచిత ఆహారం, బసను అందించే వివిధ ఆశ్రమాలను మీరు రిషికేశ్‌లో చూడవచ్చు.
సంబంధిత కథనం