తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Anand Sai HT Telugu

07 May 2024, 13:15 IST

google News
    • New Clay Pot Using Tips : వేసవిలో కచ్చితంగా మట్టికుండను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొత్త మట్టి కుండను ఉపయోగించేముందు కొన్ని పద్ధతులు పాటించాలి.
కొత్త మట్టి కుండను ఉపయోగించేందుకు చిట్కాలు
కొత్త మట్టి కుండను ఉపయోగించేందుకు చిట్కాలు

కొత్త మట్టి కుండను ఉపయోగించేందుకు చిట్కాలు

ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా.. మట్టి కుండలోని నీరు తాగితే వచ్చే సంతృప్తి వేరేలా ఉంటుంది. చాలా మంది వేసవి రాగానే మట్టి కుండలను కొనడం ప్రారంభిస్తారు. అందులో నీరు పోసి తాగుతారు. ఇది ఇప్పటి నుంచే కాదు మన తాతముత్తాతల కాలం నుంచి ఫాలో అవుతున్న పద్ధతి. వేసవిలో మట్టి కుండలోని నీటిని తాగితే చల్లగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు దక్కుతాయి. సామాన్యుడి ఫ్రిజ్ మట్టి కుండ.

కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. మట్టి కుండను కొనగానే.. నేరుగా నీరు పోసి ఇక తాగేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మట్టి కుండను కొని తీసుకొచ్చిన వెంటనే అందులోని నీటిని తాగకూడదు. ఆరోగ్యానికి మంచిది కాదు. దాని కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కచ్చితంగా ఫాలో కావాల్సిందే.

మట్టి కుండతో ఉపయోగాలు

సామాన్యులకు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు మట్టి కుండలోని తాగునీరు వరం. వేసవిలో కొత్త మట్టి కుండను కొనుగోలు చేసేవారు దానిని ఉపయోగించే ముందు కొన్ని పనులు చేయాలి. వేసవిలో ఫ్రిజ్ లేని ఇళ్లలో చల్లటి నీటి కోసం మట్టి కుండలను విరివిగా ఉపయోగిస్తారు. మట్టి కుండ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

నీరు మార్చాలి

వేడి సీజన్లో కొత్త కుండను కొనుగోలు చేసేవారు దానిని ఉపయోగించే ముందు పూర్తిగా శుభ్రం చేసి ఉపయోగించాలి. తాగునీరు పోయడానికి సరిపోయే మట్టి కుండను సిద్ధం చేయడానికి 3 రోజులు పడుతుంది. అంటే మీరు ఈరోజు మట్టి కుండను కొంటే అందులో నీరు పోయండి. మూడు రోజులపాటు అందులో నీరు పోసి ఉండాలి. నీరు మారుస్తూ ఉండాలి. ఆ తర్వాతే దానిని ఉపయోగించాలి.

లోపల కడగొద్దు

కొత్త కుండను శుభ్రం చేసేటప్పుడు, లోపలి భాగాన్ని కడగవద్దు. బయట బాగా కడగాలి. అప్పుడు కుండలో నీటితో నింపి రోజంతా ఉంచండి. మరుసటి రోజు కుండలో నీళ్లు పోసి నీడలో ఆరనివ్వాలి. నీరు పోసం కదా అని దానిని ఎండలో మాత్రం పెట్టకూడదు.

వీటితో నీటిని నింపండి

కొత్త కుండలో నీరు పోసిన తర్వాత ప్రతి కొన్ని గంటల నీటిని మార్చండి. 2-3 సార్లు నీటిని మార్చిన తర్వాత, బియ్యాన్ని నీటిలో 2 గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు పోసి అందులో కాస్త రాళ్ల ఉప్పు వేసి 12 గంటలపాటు అలాగే ఉంచాలి. అదేవిధంగా 3 రోజుల పాటు సాధారణ నీరు, బియ్యం నీరు, ఉప్పునీరును ప్రత్యామ్నాయంగా పోస్తూ కుండను సిద్ధం చేయాలి.

ఎండలో పెట్టవద్దు

3 రోజుల తర్వాత కుండ సిద్ధం చేసి తాగునీరు పోయవచ్చు. నీటిని మార్చే ముందు కుండను ఎండలో ఆరనివ్వవద్దు. ఇలా చేయడం వల్ల ఎండలో కుండ పగిలిపోతుంది. చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే. కుండను ఆరబెట్టేందుకు ఎండలో పెడతారు. దీంతో కుండకు పగుళ్లు ఏర్పడతాయి.

ఇసుకపై కుండ పెట్టాలి

కుండను నేలపై ఉంచకుండా, నది ఇసుకను పోగు చేసి, దాని పైన మట్టి కుండను ఉంచండి. కుండ చుట్టూ తడి గుడ్డ చుట్టవచ్చు. చాలా మంది కుండ కోసం స్టాండ్ సిద్ధం తయారు చేయించుకుంటారు. ఇలా చేస్తే కుండలోనీ నీరు ఎక్కువగా కూల్ అవ్వదు. అదే ఇసుక పోసి.. దానిపై కుండను పెడితే బాగుంటుంది. వీలైతే అప్పుడప్పుడు ఇసుకను కొద్దిగా నీటితో తడపండి. ఇంకా కూల్ అవుతుంది.. ఈ వేసవిలో మట్టి కుండలోని నీటితో చిల్ అవ్వొచ్చు.

తదుపరి వ్యాసం