తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Overcome Obesity With Yoga Asanas : ఈ 5 ఆసనాలతో.. ఊబకాయం సింపుల్​గా తగ్గించుకోవచ్చు..

Overcome Obesity with Yoga Asanas : ఈ 5 ఆసనాలతో.. ఊబకాయం సింపుల్​గా తగ్గించుకోవచ్చు..

06 December 2022, 9:43 IST

    • Overcome Obesity with Yoga Asanas : ఊబకాయం అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. అయితే దీనిని తగ్గించుకునేందుకు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే యోగాతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పలు ఆసనాలు చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి అంటున్నారు.
ఊబకాయం తగ్గించే ఆసనాలు ఇవే
ఊబకాయం తగ్గించే ఆసనాలు ఇవే

ఊబకాయం తగ్గించే ఆసనాలు ఇవే

Overcome Obesity with Yoga Asanas : యోగా ఆసనాలు.. మీరు ఆరోగ్యంగా, హెల్తీగా, ఫిట్​గా ఉండడంలో చాలా సహాయం చేస్తాయి. అదనపు కొవ్వును తగ్గించుకోవడంలో ఇవి చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకుంటే.. మీరు హ్యాపీగా బరువును తగ్గించుకోవచ్చు. ఇవి మిమ్మల్ని సరైన ఆకృతిలో ఉంచడంలో సహాయపడతాయి. ఊబకాయాన్ని అధిగమించడానికి మిమ్మల్ని రక్షించడంలో మీకు సహాయపడే ఐదు యోగా ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

World laughter day 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

Weight Loss Drink : ఇంట్లో తయారుచేసిన డ్రింక్.. ఈజీగా బరువు తగ్గవచ్చు

Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

Beauty Tips : యవ్వనంగా కనిపించేందుకు కలబంద, వేప ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

భుజంగాసనం

నేలపై పడుకుని ముఖం కిందికి ఉంచి.. మీ చేతులను మీ భుజాల పక్కన ఉంచండి. మీ కాళ్లను వీలైనంత వరకు సాగదీయండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటే.. ఆపై మీ శరీరాన్ని పైకి ఎత్తండి. ఈ ఆసనాన్ని సుమారు 20 నుంచి 30 సెకన్ల పాటు వేయండి. తర్వాత ఊపిరి వదులుతూ అసలు స్థితికి చేరుకోవాలి.

ధనురాసనం

నేలపై బోర్లా పడుకోండి. ఇప్పుడు మీ మోకాళ్లు వంచి.. మీ చేతులతో మీ పాదాలను పట్టుకోండి. శ్వాస పీల్చుకుంటూ.. మీ ఛాతీ, భుజాలతో పాటు మీ చేతులు, పాదాలను పైకి ఎత్తండి. 30 సెకన్ల పాటు ఈ ఆసనంలో ఉండండి. ఒకసారి పూర్తి చేసిన తర్వాత.. ఊపిరి పీల్చుకుంటూ వదలండి. అనంతరం నార్మల్ స్థితికి వచ్చేయండి. ఈ భంగిమను చేయడం వల్ల మీ అబ్స్‌ను బలోపేతం చేయవచ్చు. ఇది మీ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉస్త్రాసనం

నేలపై మీ మోకాలు, మీ తుంటిని, తొడలను ఒకే వరుసలో ఉంచండి. మీ పిరుదులపై మీ చేతులను ఉంచండి. మీ వేళ్లను కిందకి ఉంచి.. వెనుకకు వంగి వంపుని క్రియేట్ చేయండి. ఆపై మీ మడమలను వెనుకకు ఉంచి.. కనీసం 15 నుంచి 20 సెకన్ల పాటు ఆ స్థానంలో ఉండండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మీ మెడను సరిగ్గా చూసుకోండి.

నౌకాసనం

పైకప్పునకు ఎదురుగా నేలపై పడుకోండి. మీ చేతులను మీ వైపు ఉంచండి. మీ భుజాలను విశ్రాంతి తీసుకోనివ్వండి. మీ కాళ్లను నిటారుగా ఉంచండి. మీ చేతులు, కాళ్లను ఒకదానితో ఒకటి ఎత్తండి. 45 డిగ్రీల కోణంలో ఉంచండి. మీ శరీరం V- ఆకారాన్ని ఏర్పరుచుకున్న తర్వాత.. దాదాపు 45 నుంచి 60 సెకన్ల పాటు ఆ స్థానంలో ఉండండి. లోతైన శ్వాసను తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఈ యోగాసనం మీ కోర్, బొడ్డు కండరాలను బలపరుస్తుంది.

సేతు బంధ సర్వంగాసనం

మీరు నేలపై పడుకోండి. మీ అరచేతులను కింద ఉంచి.. ఎదురుగా మీ చేతులను మీ పాదాల వైపులా చాచండి. మీ తుంటిని పైకి ఎత్తడానికి వాటిని కిందకి నొక్కండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, మీ తుంటిని పైకి ఎత్తండి. 30 సెకన్ల పాటు ఈ స్థితిలోనే ఉంచండి. నెమ్మదిగా విడుదల చేసి విశ్రాంతి తీసుకోండి.