తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo A17 | పదివేల బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌!

Oppo A17 | పదివేల బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

27 September 2022, 19:59 IST

    • ఒప్పో కంపెనీ నుంచి Oppo A17 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడుడి.
Oppo A17
Oppo A17

Oppo A17

ఒప్పో కంపెనీ తమ A-సిరీస్‌ ను విస్తరిస్తూ OPPO A17 అనే మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్‌. అయినప్పటికీ ఇందులో కొన్ని మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో భాగంగా 50 మెగాపిక్సెల్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఇంకా మెరుగైన పనితీరుని కనబరిచే చిప్‌సెట్‌ను కలిగి ఉంది

ట్రెండింగ్ వార్తలు

Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Oppo A17 వెనుక కవర్ కాంపోజిట్ ప్రాసెసింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి తయారు చేసినది. కవర్ బయటి పొర UV పూతతో కప్పి ఉంటుంది. ఇది డస్ట్ రెసిస్టెంట్ కూడా. దీనివల్ల ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటుంది. ఈ సరికొత్త ఫోన్ 100% DCI-P3 హై-కలర్ గ్యామట్‌తో 5.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీ కళ్ళకు హాని కలిగించని మృదువైన రంగులను ప్రదర్శించగలదు.

Oppo A17 ఏకైక 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. అయితే లేక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఇంకా Oppo A17లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఇక్కడ చూడండి.

Oppo A17 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.56-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
  • 4 GB RAM, 64 GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్
  • వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్
  • ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ

కనెక్టివిటీ పరంగా 4G LTE, Wi-Fi, బ్లూటూత్, మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి.

ప్రస్తుతం ఒప్పో A17 స్మార్ట్‌ఫోన్‌ మలేషియాలో అందుబాటులోకి వచ్చింది. అక్కడి మార్కెట్లో దీని ధర MYR 599 (సుమారు రూ. 10,600). భారత మార్కెట్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత లేదు. కస్టమర్‌లు దీనిని My OPPO స్పేస్, OPPO అధికారిక ఆన్‌లైన్ స్టోర్, Shopee, Lazada వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.