తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poco M5 Smartphone Launch | బడ్జెట్ ధరలో పోకో ఫోన్.. హైలైట్స్ ఇవీ!

Poco M5 Smartphone Launch | బడ్జెట్ ధరలో పోకో ఫోన్.. హైలైట్స్ ఇవీ!

HT Telugu Desk HT Telugu

05 September 2022, 16:17 IST

    • పోకో ఈరోజు తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ Poco M5ను విడుదల చేస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ అని అంచనా వేస్తున్నారు. హైలైట్స్ ఇలా ఉన్నాయి.
Poco M5
Poco M5

Poco M5

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు పోకో తమ బ్రాండ్ నుంచి Poco M5 సరికొత్త Poco M5 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సరికొత్త Poco M5 అనేది బడ్జెట్ ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్‌. ఇది కొన్ని నెలల కిందట గ్లోబల్ మార్కెట్లో విడుదలైన Poco M4 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్.

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Poco M5 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 5, 2022న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. డిజైన్ పరంగా Poco M5 సింథటిక్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో రెండు-టోన్ డిజైన్‌తో వస్తుంది. అలాగే గ్రే, బ్లూ, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో రానుంది అలాగే ర్యామ్- స్టోరేజ్ పరంగా మూడు కాన్ఫిగరేషన్లను కలిగి ఉంటుందని పుకారు ఉంది.

ఫీచర్లపరంగా 6.58-అంగుళాల FHD+ LCD స్క్రీన్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఉంటాయి. మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయి, ధర ఎంత ఉండవచ్చు? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి..

Poco M5 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.58 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
  • 4GB/6GB RAM, 64GB/128GB స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్
  • వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఫాస్ట్ ఛార్జర్

ఇక మిగతా ఫీచర్లు లాంచ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ధర, రూ. 15 వరకు ఉంటుందని అంచనా.

టాపిక్

తదుపరి వ్యాసం